Geetha Madhuri:ఆ విషయం డిస్ట్రబ్ చేస్తోంది... మానసిక ఒత్తిడిలో గీతా మాధురి (వీడియో)
సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న గీతా మాధురి ప్రస్తుతం కెరీర్ లోనూ బిజీగా గడిపేస్తోంది. అటు సినిమాల్లో పాటలు పాడుతునే... బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలకు మెంటర్ గా వ్యవహారిస్తుంది. ఇక తాజాగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో సోసైటీపై మండిపడింది. అలాంటి సలహాలు అవసరం లేదని చెప్పుకువచ్చింది. అసలు ఆ వీడియోలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సింగర్ గీతా మాధురి తన పాటలతో ఎంతో మంది అభిమానులన్ని సంపాదించుకుంది. అంతే కాదు.. బుల్లితెరపై కూడా కనిపిస్తూ.. ప్రేక్షకులకు దగ్గర అయిది. నటుడు నందు ప్రేమలో పడిన గీతా మాధురి... 2014 ఫిబ్రవరి 9న నందును వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఇటీవల వీరు విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీళ్లు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా.. నెట్టింట మాత్రం వార్తలు ఆగడం లేదు.

నందు, గీతా మాధురి కలిసి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ రూమర్లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీళ్లిద్దరూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నప్పటికీ... ఈ పుకార్లు ఆగడం లేదు. ఇక స్పందిస్తే లేనిపోని గొడవ ఎందుకులే అని ఎప్పటికప్పుడు లైట్ తీసుకుంటూనే ఉన్నారు వీరు. ఇక ఇదిలా ఉండగా.. గీతా మాధురి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గీతా మాధురి.. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి సోసైటీపై విరుచుకుపడింది. మీ కన్సర్స్ అవసరం లేదంటూ చెప్పుకువచ్చింది. వివాహిత జంటలపై.. సైసైటీ చూపిస్తున్న కన్సర్ ఒత్తిడిగి గురిచేస్తుందంటూ చెప్పుకువచ్చింది. దాని వల్ల వాళ్లు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నట్లు వెల్లడించింది. ప్రశ్నలతో వారిపై ఒత్తిడి తీసుకురావొద్దంటూ చెప్పుకువచ్చింది.

ఆ వీడియోలో గీతా మాధురి మాట్లాడుతూ... నేను లాస్ట్ 10 రోజుల్లో 5 కపూల్స్ తో మాట్లాడను. అందరూ ఇంకా పిల్లలు పుట్టని జంటలు. చాలా స్ట్రేస్ లో ఉన్నారు. చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్లు అల్ రెడి ట్రై చేస్తూ ఉంటారు పిల్లల కోసం. వాళ్లు రకరకాల మూడ్ స్వింగ్స్ లో ఉంటారు. వాళ్లు చాలా ఒత్తిడిలో ఉంటారు. దానికి తోడు ప్రత్యేకంగా వాళ్లు ఎక్కువగా ఒత్తిడిగా ఫీల్ అయ్యేది సోసైటీ ప్రెజర్. సోసైటికీ అంత కన్సర్న్ ఉంటే.. పర్వాలేదు.. కానీ వెటకారంగా అడిగితే ప్రాబ్లం.. అంటూ చెప్పుకువచ్చింది.
''యే మీకు పిల్లలు లేరా.. ఇంకా ఎప్పుడు కంటారు.. ఎప్పుడు డబ్బు సంపాదనేనా.. పిల్లలు కూడా కనండి అంటూ ఉంటారు. ఇవన్నీ జంటలపై ప్రెజర్ పడుతుంది. చుట్టాలు, సోసైటీ .. వీళ్లంతా కపూల్స్ ను కంగారు పెడుతుంటారు. డాక్టర్ కు చూపించుకోండి అంటూ సజెస్ట్ చేస్తారు. వాళ్లకు తెలియదా... ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే.. సోసైటీ ప్రెజర్ లో పడి.. మీరు ఒత్తిడికి లోను కాకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ అడిగే వాళ్లు జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది.. ఇది నా బాద్యత కాదు కానీ చెప్పాలి అనిపించింది. కంగారు పడకండి.. స్ట్రేస్ తీసుకోకండి. సోసైటల్ ప్రెజర్ ను అస్సలు కన్సిడర్ చేయకండి. బీ హ్యాపీ.. బీ కూల్.. అంటూ తెలిపింది.


Click it and Unblock the Notifications











