ప్రముఖ గాయకుడిపై దాడి.. తల పగులకొట్టిన అగంతకుడు
Recommended Video
బాలీవుడ్ గాయకుడు గురు రాంధవాకు విదేశాల్లో చేదు అనుభవం ఎదురైంది. వాంకోవర్ నగరంలో సంగీత కచేరికి వెళ్లిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై జరిగిన దాడిపై బాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

వాంకోవర్‌లో ప్రదర్శన ముగించుకొని
గాయకుడు గురు రాంధవా కెనడాలోని ముఖ్యపట్టణం వాంకోవర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆదివారం రాత్రి సంగీత ప్రదర్శనను ఇచ్చారు. ప్రదర్శన ముగించుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. క్వీన్ ఎలిజబెత్ థియేటర్ గేటు వద్ద జరిగిన దాడిలో రాంధవా తలకు బలమైన గాయం తగిలినట్టు సమాారం. అయితే ప్రాణాలకు ముప్పులేదని వైద్యులు వెల్లడించారు.

స్లోలీ స్లోలీ పాటకు అత్యంత ప్రజాదరణ
గాయకుడు రాంధవా 'స్లోలీ స్లోలీ' పాటను ఇంగ్లీష్, పంజాబీ, స్పానిష్ భాషల్లో రూపొందించారు. అమెరికాలోని మియామిలో ఈ పాటను చిత్రీకరించారు. గతంలో రూపొందించిన లాహోర, పటోలా, హై రేటేడ్ గబ్రూ లాంటి పాటలకంటే ఎక్కువగా ప్రజాదరణ లభించింది. పంజాబీ భాషను మాట్లాడే ప్రజలకు రాంధవా పాటలు ఇటీవల కాలంలో మరింత చేరువయ్యాయి.

రౌడీగా భావించే వ్యక్తి దారుణంగా దాడి
కెనడా మీడియా కథనం ప్రకారం.. గురు రాంధవా మ్యూజిక్ ప్రదర్శనకు హాజరైన ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణంగా బిహేవ్ చేశారు. రాంధవా ప్రదర్శన ఇస్తున్న సమయంలో రౌడీని మించిన విధంగా ప్రవర్తించాడు. గేటు బయటకు వస్తున్న సమయంలో దాడి చేసి పారిపోయాడు. దాడికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు
త్వరలోనే కెనడా టూర్‌ను ముగించుకొని పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్ని రోజులపాటు రాంధవాకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఇటీవల టీ సిరీస్ ద్వారా విడుదల చేసిన స్లోలీ స్లోలీ పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











