తెలుగు సింగర్‌కి ఘాయ్ పిలుపు
ఒక హిందీ టీవీ ఛానెల్ నిర్వహించిన సరిగమప - ప్రతిభా కార్యక్రమంలో విజేత అయిన తెలుగు గాయకుడు హేమచంద్రకు బాలీవుడ్ డ్రీమ్ మర్చంట్ సుభాష్ ఘాయ్ సినిమాలో పాడే అవకాశం రావడం విశేషం. ఈ విషయాన్ని హేమచంద్ర గురువారంనాడు ప్రకటించారు. సుభాష్ ఘాయ్ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. అలాగే అంతకుముందు ఒక అస్సామీ సినిమాలో కూడా పాట పాడాను. తెలుగులో స్రవంతి రవికిశోర్ గారు ఇటీవల నిర్మించిన ప్రేమంటే ఇంతే.. చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు అని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు రాగవలని ఆయన ఆశాభావంతో చెప్పాడు.


Click it and Unblock the Notifications