»   » ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్

ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ఆసుపత్రి పాలయ్యారు. న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన ఆయన అనారోగ్యం పాలవ్వడంతో వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...అనారోగ్యం కారణంగా గుజరాత్ షో రద్ద చేసుకుంటున్నట్లు తెలిపారు.

Singer Kailash Kher hospitalised in Mumbai

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. నాకు సిక్ అనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాను. తొలిసారిగా పబ్లిక్ షో గుజరత్ లోని పబ్లిక్ షో రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఇలా జరుగడం కెరీర్లో ఇదే తొలిసారి అని స్పష్టం చేసారు.

అయితే అనారోగ్యానికి కారణం ఏమిటి? తనకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? అనే విషయం మాత్రం కైలాష్ ఖేర్ వెల్లడించలేదు. అయితే అతని మాటల్లో ఒకటి మాత్రం స్పష్టమవుతోంది. ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తనకు ఒక గుణపాఠం లాంటిదని...ఒబామాతో భోజనం చేస్తన్నా, నోబెల్ బహుమతి అందుకునే పరిస్థితుల్లోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని వెల్లడించారు.

English summary
Singer Kailash Kher, who just returned from New York, is unwell and has been hospitalised in Mumbai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu