Pan World Movie వర్చువల్ రియాలిటీతో పాన్ వరల్డ్ మూవీ.. ఏలియన్ స్టోరీతో యంగ్, హీరోయిన్, డైరెక్టర్!
ఇండియన్ సినిమా రంగంలో వర్థమాన తార, గాయని కనికా కపూర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించనున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందుతున్న స్పేస్ నేపథ్యంతో ఏలియన్ కథతో రూపొందుతున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. పాన్ ఇండియా వరల్డ్ మూవీగా హైదరాబాద్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి కనికా సింగ్ వివరాలు వెల్లడించారు. కనికా సింగ్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
వర్చువల్ రియాలిటీ కథతో వస్తున్న సినిమాలో నటిస్తున్నాను. గతంలో వర్చువల్ రియాలిటీతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను ప్రస్తుతం నటిస్తున్న వర్చువల్ రియాలిటీ మూవీలో కథ ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ఈ సినిమా షూట్ జరుగుతున్నది. ఈ సినిమాకు నిర్మాత గౌరీ శంకర్, దర్శకుడిగా వెంకట్ కంచర్ల. గతంలో వెంకట్ బాలీవుడ్‌లో అమితాబ్, తాప్సీ సినిమాకు పనిచేశాడు అని కనికా సింగ్ చెప్పింది.

అత్యంత సాంకేతిక అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. అదంతా దేవుడి దయ వల్లే సాధ్యమైందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను ఏలియన్ పాత్రలో నటిస్తున్నాను. ఏలియన్ పాత్రలో నేను బాగా సూట్ అవుతానని నిర్మాత, దర్శకులు భావించి సినిమా అవకాశం ఇచ్చారు అని కనికా సింగ్ చెప్పారు.
మోడలింగ్ చేయడం ద్వారా వినోదరంగంలో నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత డ్యాన్స్ నేర్చుకొన్నాను. ప్రముఖ కొరియోగ్రాఫర్ షామైక్ దామర్ స్టూడెంట్‌గా ఉన్నాను. ఆ తర్వాత సౌత్ మూవీ ద్వారా యాక్టింగ్ రంగంలోకి వచ్చాను. ప్రస్తుతం శ్రేయాస్ తల్పాడితో కలిసి నటించిన సినిమా రిలీజ్ కానున్నది. మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాను అని కనికా సింగ్ చెప్పింది.
ఏలియన్ కథతో వర్చువల్ రియాలిటీ కథతో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలోనే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్‌లో కూడా వర్చువల్ రియాలిటీతో సినిమా రాలేదు. తొలిసారి ఇలాంటి టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమా ప్రపంచ సినిమా రంగంలో ప్రత్యేకతను చాటుకొంటుందనే నమ్మకం బలంగా ఉంది. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అని కనికా సింగ్ తెలిపింది.
వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో సినిమా రావడం వల్ల.. ఇండియాకు ప్రపంచ సినిమాలో మంచి పేరు వస్తుంది. టెక్నాలజీలో ఇస్రోనే మాత్రం కాదు. ఇండియన్ సినిమా కూడా ముందు ఉందనే సంకేతాలను ప్రపంచానికి పంపిస్తుంది అని కనికా సింగ్ అభిప్రాయపడ్డారు. ఏలియన్ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం. అలాంటి సబ్జెక్ట్‌తో సినిమా రావడం.. అందులో అవకాశం లభించడం నా డ్రీమ్ పూర్తయిందని భావిస్తున్నాను.
ఉత్తరాఖండ్ నుంచి వచ్చి సినిమా పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పాపులర్ అయ్యారు. వారి దారిలోనే నడిచి నేను మరింత పాపులారిటీ సొంతం చేసుకోవాలని కోరుకొంటున్నాను. హైదరాబాద్ గురించి మాట్లాడుతూ అద్బుతమైన నగరం. మంచి వాతావరణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఏపీలో ఎక్కువగా వేడి ఉంటుంది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది. నేను హైదరాబాద్ బిర్యానీ ఇంకా తినలేదు. డైట్‌లో ఉండటం కారణంగా నేను మంసాహారానికి దూరంగా ఉంటున్నాను అని కనికా సింగ్ చెప్పింది.


Click it and Unblock the Notifications











