అసభ్యకరమైన సందేశాలతో సింగర్ కౌసల్యకు వేధింపులు.. ఎంత మందిని బ్లాక్ చేసిందో కూడా చెప్పేసింది

సింగర్ కౌసల్య గురించి ప్రత్యేకమైన పరిచయమేమీ అక్కర్లేదు. సంగీత దర్శకుడు చక్రి ఓ వెలుగు వెలిగిన కాలంలో కౌసల్య పాడిన పాటలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన గాత్రంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కౌసల్య ఇటీవలె కాలంలో అంతగా వెలుగులోకి రావడం లేదు. సింగింగ్ చాన్స్ కూడా అంతగా రాకపోవడంతో కొత్త అవతారమెత్తేందుకు కూడా రెడీ అవుతోంది.

వ్యక్తిగత జీవితంలో వివాదాలు..

వ్యక్తిగత జీవితంలో వివాదాలు..


చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్న కౌసల్య.. అతనిపై వేధింపుల కేసు పెట్టింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు దాఖలు చేసింది. గత కొంత కాలంగా తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

గాయనిగా తగ్గిన అవకాశాలు..

గాయనిగా తగ్గిన అవకాశాలు..

సింగర్‌గా కౌసల్య ఒకప్పుడు ఓ రేంజ్‌లో బిజీగా ఉండేది. చక్రి సంగీత దర్శకుడిగా పని చేసిన ప్రతీ సినిమాలో కౌసల్యా ఓ పాట పాడేది. మెలోడి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కౌసల్య గాత్రం గత కొంతకాలం నుంచి శ్రోతలకు దూరమైంది. ఆ మధ్య సింహా సినిమాలోని బంగారు కొండ అనే పాట ఫుల్ ఫేమస్ అయింది.

వెబ్ సిరీస్‌లో కౌసల్య

వెబ్ సిరీస్‌లో కౌసల్య

చక్రి మరణానంతరం అవకాశాలు సన్నగిల్లిన కౌసల్య.. నటిగా అవతారమెత్తబోతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం అటు వైపు దృష్టి తరలిస్తున్న నేపథ్యంలో సింగర్ కౌసల్య కూడా అందులోకి అడుగుపెట్టబోతోంది. సంగీతమే ప్రధానంగా సాగే ఓ వెబ్ సిరీస్‌లో కౌసల్య నటించబోతోన్నట్లు తెలుస్తోంది.

కౌసల్య వేధింపులు

కౌసల్య వేధింపులు

సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ తరుణంలో సెలెబ్రిటీలకు సమస్యలు మొదలయ్యాయి. వారి వ్యక్తిగత నంబర్లు కూడా ఇట్టే తెలిసి పోతున్నాయి. వారి సోషల్ మీడియా ఖాతాలు కూడా అందరికీ అందుబాటులో ఉండటం లాంటివి వారికి పెద్ద తలనొప్పిని తీసుకొస్తున్నాయి. సింగర్ కౌసల్యకు ఇలాంటి వేధింపులే ఎక్కువ కావడం, అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం లాంటి వాటితో విసిగెత్తి పోయినట్టు సమాచారం. ఆకతాయిల చేష్టలకు విసిగి వేసారిన కౌసల్య దాదాపు 342మందిని బ్లాక్ చేశానని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X