సింగర్ కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
హైదరాబాద్ : తెలుగు సింగర్ కృష్ణ చైతన్య, టీవీ యాంకర్ మృదుల ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షమంలో గ్రాండ్‌గా జరిగింది. సూపర్ సింగర్ రియాల్టీ షో ద్వారా కృష్ణ చైతన్య బాగా పాపులర్ అయ్యాడు. అదే విధంగా మృదుల కూడా పలు ఛానల్స్‌లో, సినిమా కార్యక్రమాలలో తన యాంకరింగుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సింగర్ కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల మధ్య గత కొంతకాలంగా ప్రమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి విషయం ఇంట్లో తెలిసిపోయిందని, పెద్దలు కూడా వీరి వివాహానికి అంగీకరించారని, త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. బహుషా వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సినీగాయకుల వివాహాలు వరుస పెట్టి జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితమే హేమచంద్ర-శ్రావణ భార్గవి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరో సంగర్ మాళవిక వివాహం కూడా బ్రిటన్లో పని చేస్తున్న వ్యక్తితో జరిగింది. నిన్నగాక మొన్న సింగర్ గీతా మాధురి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇపుడు కృష్ణ చైతన్య, మృదుల ఒక్కటవుతున్నారు.

సాంప్రదాయ బద్దంగా
కృష్ణ చైతన్య, మృదుల నిశ్చితార్థం సాంప్రదాయ బద్ధంగా జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నిన్ను జీవితాంతం ఏలుకుంటా
నిన్ను నా గుండెల్లో పెట్టుకుని జీవితాంతం ఏలుకుంటానంటూ మృదులకు పెళ్లి ప్రపోజ్ చేస్తున్న కృష్ణ చైతన్య.

చూడ చక్కని జంట
కృష్ణ చైతన్య, మృదుల చూడ చక్కని జంట అనే విధంగా ముచ్చటగా ఉన్నారు కదూ ఈ ఫోటో చూస్తుంటే...

స్నేహితులతో
నిశ్చితార్థం సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో కలిసి కృష్ణ చైతన్య, మృదుల ఇలా సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఆత్మీయులతో
నిశ్చితార్థ వేడుక అనంతరం కృష్ణ చైతన్య, మృదుల ఇలా ఆత్మీయులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కరల్ ఫుల్‌గా
కృష్ణ చైతన్య, మృదుల నిశ్చితార్థం సందర్భంగా కలర్ ఫుల్‌గా వేదికను అలంకరించారు. ఈ వేదికపై ఈ జంట మరింత అందంగా కనిపించారు.


Click it and Unblock the Notifications











