భారీగా నగదుతో పట్టుబడ్డ సింగర్ మికాసింగ్
నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు అత్యధికంగా $3,000 నగదు, $7,000 విలువ చేసే చెక్ మాత్రమే క్యారీ చేయవచ్చు. అయితే మికాసింగ్ వద్ద పరిమితికి మించి ఉండటంతో కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ అధికారులు మాట్లాడుతూ...మికాసింగ్ రూ. 3 లక్షల ఇండియన్ కరెన్సీ, 12000 డాలర్ల అమెరికన్ కరెన్సీ తన దగ్గర ఉంచుకున్నారు. ఫెమా నిబంధనలకు ఇది విరుద్ధం అని వెల్లడించారు. అదే విధంగా అతని వద్ద అదనంగా విదేశీ మద్యం బాటిళ్లను కనుగొన్నట్లు వెల్లడించారు.
కస్టమ్స్ అధికారులకు ముందుగా మికాసింగ్ తన వద్ద రూ. లక్ష ఇండియన్ కరెన్సీ, 5000 డాలర్ల అమెరికన్ కరెన్సీ మాత్రమే ఉందని వెల్లడించారు. అయితే అతని ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ వింతగా ఉండటంతో అతను ఏదో దాస్తున్నట్లు అధికారులకు అనుమానం వచ్చింది. పూర్తిగా చెక్ చేయడంతో మికాసింగ్ దొరికిపోయాడు.
కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం మికాసింగ్ కు కొత్తేమీకాదు. 2006లో బర్త్ డే పార్టీలో రాఖీ సావంత్‌కు లిప్ లాక్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. మికా సింగ్ ప్రముఖ సింగర్ దలేర్ మెహెందీకి సోదరుడు. ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాల్లో పాటలు పాడి పాపులర్ అయ్యారు.


Click it and Unblock the Notifications












