»   » రఘు మాస్టర్, సింగర్ ప్రణవి వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోస్)

రఘు మాస్టర్, సింగర్ ప్రణవి వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌... రామదాసు, లయన్‌, హ్యాపీడేస్‌, యమదొంగ చిత్రాల్లో తన గాత్రంతో గుర్తింపు పొందిన గాయని ప్రణవిని గురువారం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ విషయాన్ని ఎస్పీ బాలు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... నూతన వధూవరులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.

గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటన్ చేస్తూ వచ్చారు. అయితే ఆ మధ్య ఆడియో వేడుకలో యాంకర్ ఝాన్సి వీరి ప్రేమ వ్యవహారం బయట పెట్టడం విషయం బయటకు లీకైంది. గతేడాది డిసెంబర్‌ 26న వీరి నిశ్చితార్థం జరిగింది.

ప్రస్తుతం టాలీవుడ్లో టాపులో కొనసాగుతున్న కొరియోగ్రాఫర్లలో రఘు మాస్టర్ ఒకరు. ఆర్య2 సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయిన రఘు మిర్చి, జిల్, అఖిల్ తో పాటు అనేక చిత్రాలకు పని చేసారు. సింగర్ ప్రణవి కూడా సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

వెడ్డింగ్ రిసెప్షన్

వెడ్డింగ్ రిసెప్షన్

రఘు మాస్టర్, సింగర్ ప్రణవి వెడ్డింగ్ రిసెప్షన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

నిశ్చితార్థం

నిశ్చితార్థం

గతేడాది డిసెంబర్ 26న వీరి నిశ్చితార్థం జరిగింది. అప్పటి ఫోటో ఇది.

సినిమా రంగం

సినిమా రంగం

ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారే కావడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.

English summary
"Attended the weddingth reception of Singer Pranavi with Choreographer Raghuram in Hyderabad. WIshing the couple a happy wedded life." S.P. Balasubrahmanyam said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu