అర్ధరాత్రి రోడ్డు మీద ఆటో నడుపుకుంటు కనిపించిన రాహుల్ సిప్లిగంజ్.. అదే లంబోర్ఘిని అంటూ..
తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న టాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. అతను ఎలాంటి ఫోటో వీడియో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల అర్ధరాత్రి వీధుల్లో ఆటో నడుపుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చాలా ఎమోషనల్ గా వివరణ ఇవ్వడం విశేషం.

ఆ సాంగ్స్ తో మంచి క్రేజ్
రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో కొన్ని విభిన్నమైన పాటలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మగజాతి, మంగమ్మ అనే యూట్యూబ్ సాంగ్స్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్ మొదట మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత పూర్ బాయ్ అనే పాట కూడా అతని స్థాయిని మరింత పెంచింది. ఆ పాటలే అతనికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేశాయి.

ఆ సినిమాతో గాయకుడిగా..
రాహుల్ సిప్లిగంజ్ మొదట 2009లో వచ్చిన జోష్ సినిమా ద్వారా గాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో కాలేజీ బుల్లోడా అనే సాంగ్ తో అతని కెరీర్ స్టార్ట్ అయింది. అనంతరం దమ్ము సినిమాలో పాడే అవకాశం దక్కించుకున్నాడు. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి అతని టాలెంట్ను గుర్తించి దమ్ము సినిమాలో వాస్తు బాగుందే అనే పాట పాదించాడు. ఆ తరువాత రాహుల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మాస్ జనాలను ఆకట్టుకునే విధంగా
ఆ తరువాత మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్ వంటి స్టార్ సంగీత దర్శకులతో కూడా వర్క్ చేశాడు. అతను ఎలాంటి పాట పాడిన కూడా ఈజీగా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది అనేలా క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా మాస్ జనాలను ఆకట్టుకునే విధంగా పాడడంలో అతని స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇక మెల్లగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ద్వారా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.

బిగ్ బాస్ లో కూడా..
బిగ్ బాస్ 3 సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పోటీ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా కూడా రాహుల్ అందమైన అమ్మాయిల తో మంచి కెమిస్ట్రీ కొనసాగిస్తూనే ప్రేక్షకుల మద్దతు అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా రాహుల్ సిప్లిగంజ్ కి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి.

RRR పాటతో..
ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమా లో రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా తన గాత్రంతో ఆ పాటను పాడటంతో సినిమాకు కూడా చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాహుల్ సిప్లిగంజ్ ఆ పాటను పాడటం జరిగింది.
ఆటో నడిపిన రాహుల్
ఇక త్రిబుల్ ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ అక్కడ రాత్రి ముంబై వీధుల్లో ఆటోలో నడుపుతూ సరదాగా కాలక్షేపం చేసాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సింపుల్ గా వివరణ ఇచ్చాడు. అదే నా లైఫ్ లో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ పేర్కొనడం విశేషం.


Click it and Unblock the Notifications











