పైకి కనపడేది నిజం కాదు.. వాడు అలాంటోడే.. సింగర్ యశస్వి గుట్టువిప్పిన రేవంత్

ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అప్పటి వరకు ఎవ్వరో కూడా తెలియని వారిని ఓవర్ నైట్ స్టార్‌గా చేసేస్తుంటాయి. ఇందులో కొన్ని వెరైటీలు కూడా ఉంటాయి. అప్పటి వరకు ఓ పాట మామూలుగా హిట్ అయి ఉంటుంది. కానీ ఆ పాటలను తిరిగి పర్ఫామ్ చేసినప్పుడే కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలా నక్కిలీసు గొలుసు అనే పాటను దుర్గారావ్, ఢీ షోలో పండు పర్ఫామ్ చేశాక మరో లెవెల్‌కు చేరింది. అలాగే జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడి యశస్వి కొండెపూడి అనే సింగర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

ఒక్కసారిగా ఫేమస్..

ఒక్కసారిగా ఫేమస్..

జీ తెలుగులోని సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అంటూ ప్రారంభించిన షోలో యశస్వి కొండెపూడి హైలెట్ అయ్యాడు. కేవలం అతడి కోసమే షోను చూసే వారు ఎక్కువయ్యారు. లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి అందరినీ కట్టిపడేశాడు. ఈ ఒక్క పాటతో ఏ సింగర్‌కు రానంత పేరు ఒక్క రోజులోనే వచ్చేసింది.

పర్సనల్ విషయాలు..

పర్సనల్ విషయాలు..

అలా ఫేమస్ అయిన యశస్వి గురించి అందరూ వెదుకులాటలు ప్రారంభించారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు.. ఇలా ఎలా ఎదిగాడు.. అతని పుట్టుపూర్వోత్తరాలు ఏంటన్న సంగతులు వెదికారు. యూట్యూబ్‌లో ఇతనికి సపరేట్ చానెల్ ఉన్నా కూడా ఇతని పేరు మీద అనేక చానెల్‌లు వెలిశాయి. ఎంతో మంది ప్రేమిస్తున్నామంటూ మెసెజ్‌లు వస్తుండటంతో తన ప్రేమ కథను అందరి ముందు చెప్పేశాడు.

 చిన్నతనం నుంచి..

చిన్నతనం నుంచి..

ఈ మధ్య వచ్చిన పార్టీకి వేళాయేరా అనే ఈవెంట్‌లో యశస్వి తన ప్రేయసి జానుని పరిచయం చేశాడు. స్కూల్ ఏజ్ నుంచి ప్రేమ అని చెబుతూ... తమ ప్రేమకు నిదర్శనంగా పచ్చబొట్లను కూడా చూపించేశారు. మొత్తానికి ఇలా కెరీర్, పర్సనల్ లైఫ్‌ను పీక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు యశస్వి.

చూడటానికి అలా..

చూడటానికి అలా..

యశస్వి చూడటానికి ఎంతో అమాయకుడిలా ఉంటాడు. బయట ఇంటర్వ్యూల్లోనూ ఎక్కువగా మాట్లాడడు. చాలా మితభాషి. ఎంతోతక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాజాగా సింగర్ రేవంత్ ఓ విషయాన్ని బయటపెట్టేశాడు. యశస్వి గురించి అసలు విషయం చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

Dadasaheb Phalke Award For Naveen Polishetty & Nagarjuna
పైకి మాత్రమే అలా..

పైకి మాత్రమే అలా..

తాజాగా రేవంత్ ఓ మీడియాతో మాట్లాడుతూ యశస్వి గురించి చెప్పుకొచ్చాడు. యశస్వి ఏమీ అమాయకుడు కాదు.. బయటకు అలా కనిపిస్తాడు అంతే.. పైకి కనపడేది నిజం కాదు.. వాడు డాక్టర్ కాదు పెద్ద యాక్టర్ అంటూ అసలు గుట్టు విప్పాడు. అందరి మీద సెటైర్లు వేస్తుంటాడు.. అయితే యశస్వి చాలా మంచివాడు. ఇప్పుడు అతనికి వచ్చిన క్రేజ్‌ను తలకి ఎక్కించుకోకుండా ఇంకా కష్టపడి ముందుకు పోవాలని కోరుకుంటున్నానని రేవంత్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X