అందుకే పాట నచ్చింది.. అదరకొట్టిన గాయకుడు సింహ..!
నిర్మాత ఎస్ కమల్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న తాజా చిత్రం ఉందా లేదా. ఓ డిఫరెంట్ టైటిల్ వస్తున్న ఈ చిత్రం సస్పెన్సు, థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ మురళి కార్తికేయ. ఈ సినిమా ఈ నెల 15వ తేదిన విడుదలవుతున్న సందర్బంగా ప్రి రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు సింహ మాట్లాడుతూ.. నేను ఎక్కువగా మాస్ సినిమాలు, పెద్ద సినిమాలకే పాటలు పాడతాను. కానీ ఈ పాట లిరిక్స్ వినగానే చాలా నచ్చింది వెంటనే ఒప్పుకున్నాను. అయితే ఈ పాట పాడిన తర్వాత కూడా ఇంకో సారి పాడితే బాగుంటుంది అంటే మళ్ళి పాడటం జరిగింది అని చెప్పారు. వేదిక ఆ పాటను పాడి వినిపించారు.
unda leda latest telugu movie sri murali karthikeya singar simha actor jhansi singar simha శ్రీ మురళి కార్తికేయ యాక్టర్ ఝాన్సీ


Click it and Unblock the Notifications