twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్ స్మిత ఫేస్‌బుక్ హ్యాక్ .. పిచ్చి పిచ్చి పోస్ట్‌లతో రచ్చ!

    |

    తెలుగు పాప్ సింగర్స్‌లో ఉన్న అతికొద్దిమందిలో సింగర్ స్మిత ఒకరు. ఒకప్పుడు పాప్ సాంగ్స్‌తో కేవలం తెలుగు జనాలనే కాదు.. యావత్ భారతదేశాన్ని ఓ ఊపు ఊపేసింది స్మిత. హాయ్ రబ్బా హాయ్ అనే పాటతో యువతరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఈ తరానికి స్మిత గుర్తుకు రావాలంటే.. బాహుబలి కిలికి సాంగ్‌ను చూపించాలి. కిలికి భాషపై ఓ ప్రైవేట్ సాంగ్ కంపోజ్ చేసి మరీ తన అందాలతో ఆల్బమ్ అదరగొట్టింది.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సింగర్ స్మిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ అందర్నీ ప్రశ్నింస్తుంది. సినిమాల్లో విలన్లుగా రాజకీయ నాయకులే ఎందుకు ఉంటారని ఆ మధ్య తన పాప అడిగిందని, అయితే ఆ విషయం మన తెలుగు దర్శకులే చెప్పాలంటూ అందరిపై సెటైర్స్ వేసింది.

    నెల్లూరు ఘటనపైనా..

    నెల్లూరు ఘటనపైనా..

    నెల్లూరులో మాస్క్ ధరించమని చెప్పిన ఓ మహిళపై అధికారి చేసిన దాడిపై స్మిత ఫైర్ అయింది. ఈ ఘటన రాష్ట్ర మొత్తం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరింది.

    ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్..

    ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్..

    సింగర్ స్మిత తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తన ఖాతాను ఎవరో చేజిక్కించుకున్నారని పిచ్చి పిచ్చి పోస్ట్‌లు పెడుతున్నారంటూ వాపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలా డిలీట్ చేయాలో కూడా తెలీడం లేదని, అవి డిలీట్ అవ్వడం లేదని, ఫిర్యాదు చేశామని తెలిపింది.

    ఐయామ్ బ్యాక్..

    ఐయామ్ బ్యాక్..

    తాజాగా తన ఫేస్ బుక్ ఖాతా సేఫ్ అని ఐయామ్ బ్యాక్ అంటూ స్మిత ఓ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘ఇదో భయంకరమైన రోజు. నా ఎఫ్‌బీ పేజ్‌ను ఎవరో హ్యాక్ చేశారు. పిచ్చి పిచ్చిపోస్ట్‌లు చేశారు. కానీ ఇప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చింది. ఇంత త్వరగా దీన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు ఏదైనా అసౌకర్యం కలిగించేలా పోస్ట్‌లు వచ్చి ఉంటే క్షమించండి. ఐయామ్ బ్యాక్' అంటూ స్మిత చెప్పుకొచ్చింది.

    English summary
    Singer Smita Facebook account Hacked And Got Back. Had one hell of a mad day. My FB page got hacked and someone started posting stupid content. It’s back now. Thanks to everyone and FB team for working on it and reviving this page quickly. Sorry for any inconvenience caused and spam on your timelines. I am back
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X