మనుషులు పూర్తిగా అది కోల్పోయారా?.. దారుణ ఘటనపై సింగర్ స్మిత ఫైర్
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా విడమరిచి చెప్పనక్కర్లేదు. కరోనా విజృంభణకు పోలీసులు, డాక్టర్లు అని తేడా లేకుండా అందరూ తలొంచాల్సి వస్తోంది. కరోనాను ఎదిరించడానికి ప్రస్తుతం ఫేస్ మాస్క్ మాత్రమే అనివార్యమైంది. ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ఓ కింది స్థాయి మహిళా ఉద్యోగి పైస్థాయి అధికారికి చెబితే కోపం వచ్చింది. దీంతో ఆ మహిళను సదరు ఉద్యోగి దారుణంగా చితక బాదాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

దారుణ ఘటన..
నెల్లూరు జిల్లా పర్యాటకాభివృద్ధి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ భాస్కర్ కింది స్థాయి మహిళా ఉద్యోగినిపై ప్రతాపాన్ని చూపాడు. ఈ నెల 27వ తేదీన మాస్క్ ధరించకుండా విధులకు హాజరైన భాస్కర్.. తన కింది స్థాయి ఉద్యోగులతో సమావేశం అయ్యాడు. దీన్ని చూసిన ఉద్యోగిని ఒకరు.. మాస్క్ ధరించాలని సూచించింది. దీంతో మండి పడ్డ భాస్కర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
వీడియో వైరల్..
అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మహిళను ఈడ్చి పడేసి అందరూ ఉండగానే చితక్కొడుతున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో హల్చల్ చేశాయి. సదరు మహిళకు న్యాయం చేయాలని ఏప్రీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సింగర్ స్మిత ఫైర్..
మహిళను అత్యంత కిరాతకంగా కొడుతున్న ఈ వీడియోపై సింగర్ స్మిత స్పందించింది. ఏంటి ఇదంతా.. ఇలాంటి వారిని ఏం చేయాలి.. మనుషులు పూర్తిగా సున్నితత్త్వాన్ని కోల్పోయారా? అంటూ అసహనాన్ని ప్రదర్శించింది. దీనిపై హరీష్ శంకర్ కూడా స్పందిస్తూ.. కొందరి మానసిక స్థితి సరిగా లేదని నాకు అనిపిస్తోంది.. ఇది కచ్చితంగా హర్షించదగ్గది కాదని ట్వీట్ చేశాడు.
Recommended Video
అరెస్ట్ చేసిన పోలీసులు..
మహిళపై కిరాతకంగా విరుచుకు పడ్డ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించడంపై ఏపీ డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ఎస్పీ భాస్కర్ భూషణ్, నెల్లూరు పోలీసులను ప్రత్యేకంగా ప్రశంసించారు. దిశ పోలీస్ స్టేషన్‌లో అప్పగించండని, వారంలోపు ఛార్జ్ షీట్‌ను పొందు పరచండని ఆదేశించారు.


Click it and Unblock the Notifications











