సింగర్ స్మితకు కరోనా పాటిజివ్...సురక్షితంగానే ఉన్నా అంటూ క్లారిటీ

పాప్ సింగర్, ప్లే బ్యాక్ సింగర్, నటి స్మిత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లాక్ డౌన్ కాలంలో స్మిత చేసినంత హల్చల్ ఇంకెవ్వరూ చేసి ఉండరు. నెల్లూరు ఘటనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది స్మిత. అంతే కాకుండా ఈ మధ్య తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిన సందర్భంలోనూ ఫైర్ అయింది. పిచ్చి పిచ్చి పోస్ట్‌లు చేయడంపైనా హ్యాకర్లపై మండిపడింది. అయితే ఇంట్లోనూ ఉంటూ, సురక్షితంగా ఉన్నప్పటికీ తమకు కరోనా సోకిందని స్మిత తాజాగా ప్రకటించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

సింగర్ స్మిత సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో సెటైర్లు కూడా వేస్తూ ఉంటుంది. ఆ మధ్య స్మిత చేసిన ట్వీట్ సినీ దర్శకులను ఆకట్టుకుంది. సినిమాల్లో విలన్లుగా రాజకీయ నాయకులే ఎందుకు ఉంటారని ఆ మధ్య తన పాప అడిగిందని, అయితే ఆ విషయం మన తెలుగు దర్శకులే చెప్పాలంటూ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

సామాజిక సమస్యలపైనా..

సామాజిక సమస్యలపైనా..

స్మిత తన వ్యక్తిగత విషయాలనే కాకుండా సామాజిక సమస్యలపైనా స్పందిస్తుంది. నెల్లూరులో మాస్క్ ధరించమని చెప్పిన ఓ మహిళపై అధికారి చేసిన దాడిపై స్మిత ఫైర్ అయింది. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరింది.

ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అవ్వడంపై..

ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అవ్వడంపై..

తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్అవ్వడంపై స్మిత అందరినీ హెచ్చరించింది. అది తన అధీనంలో లేదని, ఎవరో పిచ్చి పిచ్చి పోస్ట్‌లు చేస్తున్నారని, అందర్నీ జాగ్రత్తగా ఉండమని సూచించింది. ఆపై హ్యాకర్స్ నుంచి తన చేతిలోకి వచ్చాక అందరినీ క్షమించమని అడిగింది. ఏదైనా అసౌకర్యమైన పోస్ట్‌లు వచ్చి ఉంటే సారీ అని తెలిపింది.

Recommended Video

Ilaiyaraaja : Unknown Facts About Ilaiyaraaja
ఇంట్లో ఉన్నా కూడా..

ఇంట్లో ఉన్నా కూడా..

కరోనా సోకిన విషయాన్ని స్మిత స్వయంగా ప్రకటించింది. ‘నిన్నంతా పిచ్చిలేచింది. ఒళ్లు నొప్పులు బాగా వచ్చాయి.. వర్కౌట్లు చేయడం వల్లే అవి వస్తున్నాయని అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయిస్తే నాకు, నా భర్త(శశాంక్)కు కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలేవీ లేవు. కరోనాను తన్ని అవతల పంపించేందుకు, ప్లాస్మా దానం చేయాలని, సంతోషంగా ఉండాలని ఎదురుచూస్తున్నాను. మేము ఇంట్లోనూ ఉన్నాం.. సురక్షితంగానే ఉన్నాం.. కానీ కరోనా మా ఇంటికి వచ్చింద'ని స్మిత ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X