నాతో ఎలా ఆడుకుందంటే.. ఆ అనుభవాలతో కొన్ని వీడియోలు పెడతాను.. సింగర్ స్మిత కామెంట్

తెలుగులో సింగర్ స్మిత సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. పాప్ సింగర్‌గా స్మిత క్రియేట్ చేసిన ఆల్బమ్స్ నేషనల్ వైడ్‌గా సెన్సేషనల్ అయ్యాయి. ఇక నటిగానూ స్మిత తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆధ్యాత్మిక చింతనలోనూ భక్తి రస గీతాలను ఎంతో మధురంగా ఆలపించి ఎంతో మందిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
టాలీవుడ్‌లో కరోనా కలకలం..

టాలీవుడ్‌లో కరోనా కలకలం..

టాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బుల్లితెర, వెండితెర ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా బుల్లితెరకు చెందిన తారలే ఎక్కవుగా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. సీరియల్, పలు ఇతర ఈవెంట్‌లు అంటూ షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

సింగర్లపై పంజా..

సింగర్లపై పంజా..

ప్రస్తుతం కరోనా వైరస్ కన్ను టాలీవుడ్ సింగర్లపై పడింది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకింది. కాస్త సీరియస్ అవుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా సింగర్ సునీత, మాళవికలకు కూడా కరోనా సోకింది. ఈ మేరకు తాను క్షేమంగా ఉందని సునీత క్లారిటీ ఇచ్చింది.

కరోనా వచ్చిందని సెటైర్..

కరోనా వచ్చిందని సెటైర్..

కరోనా సోకిన విషయాన్ని స్మిత సోషల్ మీడియా వేదికగా చెబుతూ.. ‘నిన్నంతా పిచ్చిలేచింది. ఒళ్లు నొప్పులు బాగా వచ్చాయి.. వర్కౌట్లు చేయడం వల్లే అవి వస్తున్నాయని అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయిస్తే నాకు, నా భర్త(శశాంక్)కు కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలేవీ లేవు. కరోనాను తన్ని అవతల పంపించేందుకు, ప్లాస్మా దానం చేయాలని, సంతోషంగా ఉండాలని ఎదురుచూస్తున్నాను. మేము ఇంట్లోనూ ఉన్నాం.. సురక్షితంగానే ఉన్నాం.. కానీ కరోనా మా ఇంటికి వచ్చింద'ని ట్వీట్ చేసింది.

 చిన్న చిన్న వీడియోలు

చిన్న చిన్న వీడియోలు

తాజాగా కరోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలుపుతూ.. ‘గుడ్ ఈవినింగ్, ఇంటికి తిరిగి వచ్చాను. ఎంతో బాగున్నాను. మీరు కురిపించిన ప్రేమకు థ్యాంక్స్, గత ఇరవై రోజులుగా కరోనా నాతో ఎలా ఆడుకుందో నా అనుభవాలు ఏంటో చిన్న చిన్న వీడియోల రూపంలో చెబుతాను. అవన్నీ మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను.. అదే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా'నని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X