సింగర్ స్మిత ట్వీట్.. కుల ప్రస్థావన రావడంతో.. పతివ్రత పాయసం వండితే అంటూ!!
హాయ్ రబ్బా హాయ్ అనే పాట వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు, అందులో నటించిన సింగర్ స్మిత అందరికీ గుర్తుండే ఉంటుంది. నాటి క్లాసిక్ సాంగ్స్‌ను నేటి యువత అభిరుచికి తగ్గట్టుగా రీమిక్స్ చేసి పాప్ సింగర్‌గా పాపులర్ అయింది. కేవలం ప్రైవేట్ ఆల్బమ్సే కాకుండా.. సినిమా పాటలు కూడా పాడింది.అంతేకాకుండి వెండితెరపైనా మెరిసింది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

మల్టీ టాలెంటెడ్..
పాప్ సింగర్‌గా బిజీగా ఉంటూ, మసక మసక చీకటిలో, సన్నజాజి పాడాక, మహా కిలికి వంటి సాంగ్స్‌తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. పాటలే కాకుండా డ్యాన్స్, నటన ఇలా అన్నింటిలోనూ తన ప్రతిభను చాటింది.

భక్తిరస పాటలు..
ఎస్వీబీసీ చానెల్‌లో అన్నమయ్య కీర్తనలు పాడిన స్మిత చాలా కాలం తరువాత కిలికి భాషపై రూపొందించిన పాటతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. మల్లీశ్వరీ, ఆట సినిమాలో నటించిన అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.

వారే ఎందుకు విలన్స్..
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్వీట్ చేసే స్మిత.. టాలీవుడ్ డైరెక్టర్స్‌కు ఓ ప్రశ్న వేసింది. ప్రతీ సినిమాలో రాజకీయ నాయకులే ఎందుకు విలన్స్‌గా ఉంటారని తన కూతురు ఓ ప్రశ్న అడిగిందని ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రశ్నకు మన దర్శకులు సమాధానం చెప్పాలని ఫన్నీ ట్వీట్ చేసింది.

తాజాగా మరో ట్వీట్..
ప్రముఖ రచయిత గుర్రం జాషువా చెప్పిన కొటెషన్లను పోస్ట్ చేస్తూ ఇది నిజం అంటూ ట్వీట్ చేసింది. ‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.. జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం' అంటూ పోస్ట్ చేసింది.
Recommended Video

రెచ్చిపోయిన నెటిజన్స్..
స్మిత పెట్టిన ఈ పోస్ట్.. ఏపీ ప్రస్తుత పరిస్థితులు చాటేలా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెడుతూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కులగజ్జికి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వు ఈ మాటలు చెబుతావా? పతివ్రత పాయసం వండితే వారం రోజుల వరకు చల్లార లేదంట, అందులో కొన్ని చంద్రబాబుకు సరిపోతాయని, కొన్ని జగన్‌కు సెట్ అవుతాయని ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











