నాన్న కోలుకోవడానికి.. కాస్త ఎక్కువ సమయమే పట్టోచ్చు: SPB తనయుడు చరణ్

ప్రపంచం సంగీత లోకం ప్రస్తుతం మనసులో ఒక విషయాన్ని బలంగా కోరుకుంటోంది. ఎలాగైనా దిగ్గజ గాయకుడు ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ పాటలు పాడాలని, మళ్ళీ ఆయన మన ముందు సరదాగా కనిపించాలని ప్రతి ఒక్కరు బలంగా కోరుకుంటున్నారు. అయితే మధ్యలో కొన్ని రూమర్స్ అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాయి. ఆ గాసిప్స్ డోస్ పెరగకుండా ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులు వివరణ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ.చరణ్ కూడా ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Recommended Video

SP Balasubrahmanyam : ICU కి తరలింపు, కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్ | Oneindia Telugu
 స్పెషల్ ICUలో చికిత్స

స్పెషల్ ICUలో చికిత్స

కరొనా వైరస్ భారిన పడగానే ఎస్పీబీ వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. వైద్యులు ఇంట్లోనే ఉంటే సరిపోతుందని చెప్పినప్పటికీ SPB రిస్క్ తీసుకొని ఇంట్లో వాళ్ళని కూడా ప్రమాదంలోకి నెట్టివేయలేను అని హాస్పిటల్ లోనే ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. అయితే సడన్ గా వైరస్ తీవ్రత పెరగడంతో ఆయనను వైద్యులు స్పెషల్ ICU లో ఉంచారు. ఇక ఇదే విషయంపై ఆయన తనయుడు చరణ్ వివరణ ఇచ్చారు.

 మరోసారి క్లారిటీ ఇచ్చిన చరణ్..

మరోసారి క్లారిటీ ఇచ్చిన చరణ్..


ఎస్పీ.చరణ్ మాట్లాడుతూ.. నాన్నగారిని ఆదివారం రోజు ఐసీయూ నుంచి మరో స్పెషల్ ఐసీయూలోకి తరలించారు. ప్రస్తుతం నాన్న బాగానే ఉన్నారు. థంబ్స్ అప్ చూపిస్తున్నారు. వైద్యులను కూడా గుర్తుపడుతున్నారు. వారితో మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన లైఫ్ సపోర్ట్ తోనే ఉన్నారు. మునుపటి కంటే మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు.

 అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు

అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు

నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతుండడంతో వైద్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాన్న కొలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకటి రెండు రోజుల్లో నయం కాదు. ఒక వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు. వైద్యులు ఆయన కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.

బుధవారం డిశ్చార్జ్ కానున్నారు.

బుధవారం డిశ్చార్జ్ కానున్నారు.

వీలైనంత త్వరగా నాన్నగారు కోలుకొని ఇంటికి వస్తారని నమ్మకంతో చెబుతున్నాను. అందరిని ఎప్పటిలానే గుర్తు పడుతున్నారు. ఇక త్వరలోనే మాట్లాడతారని నేను భావిస్తున్నాను. మా అమ్మగారు కూడా కొలుకుంటున్నారు. ఆమె బుధవారం డిశ్చార్జ్ కానున్నారు. మా కుటుంబం పట్ల మా క్షేమం కోసం ఇంతగా ప్రేమ చూపిస్తు.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఎంతో మందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని SP.చరణ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X