twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కులాల పోరుతో సినిమా ఛండాలంగా, ఫ్యాన్స్ మాత్రమే చూస్తే చాలా?: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూటి ప్రశ్న

    విజయవాడలో ఎస్పీబాలసుబ్రమణ్యం కు లైఫ్ టైమ్ ఎచీవమెంట్ అవార్డ్ లభించింది.

    By Srikanya
    |

    విజయవాడ : శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మ ణ్యం అంటే గుర్తుపడతారో లేదో తెలియదు కానీ... ఎస్పీ బాలు అంటే గుర్తుపట్టని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకటికాదు.. రెండు కాదు.. వేపాటలు పాడి రాష్ట్రీయ.. జాతీయ అవార్డులు అందుకున్నారు ఈ గాన గాంధర్వుడు.

    విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం బాలును ఘనంగా సత్కరించి, జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు తన మనసులోని భావాలను బాలు పంచుకున్నారు.

    ప్రస్తుతం సినిమా రంగం జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందని ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఫ్యాన్స్‌ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరించాలని కోరారు.

    విస్మరిస్తూ చిత్రాలు

    విస్మరిస్తూ చిత్రాలు

    తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు. అలాంటి వాటిని విమర్శించే ధైర్యం తనకు లేదన్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

    తప్పుకుని తిరిగా

    తప్పుకుని తిరిగా

    ఒకపాట విజయవంతం కావాలంటే గాయకుడితో పాటు రచయిత, సంగీత దర్శకుడు, నటుల కృషి ఉంటుందని చెప్పారు. శంకరాభరణంలో పాట పాడేందుకు తాను అర్హుడిని కాదని భావించి చాలాకాలం తప్పుకొని తిరిగానని, వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని భావించి పాడానని గుర్తుచేసుకు న్నారు.

    గొప్ప పాటలిచ్చారు

    గొప్ప పాటలిచ్చారు

    మనకు అక్షరశిల్పులు చాలామంది ఉన్నారని, మల్లాది, సముద్రాల, ఆరుద్ర, జాలాది వంటి వారు గొప్పపాటలు అందిం చారని చెప్పారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్పరచయితలు మనకు ఉన్నారన్నారు. మహ్మద్‌ రఫీ మంచి గాయకుడని, ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పారు ఎస్పీబాలసుబ్రమణ్యం.

    రామోజీరావు రూపంలో

    రామోజీరావు రూపంలో

    తనకు పాటలు తగ్గిన సమయంలో ‘పాడుతా తీయగా' వంటి అద్భుతమైన కార్యక్రమం ద్వారా కొత్త శక్తిని.. జీవితాన్ని తాను పొందానని బాలు చెప్పారు. దేవుడు సంగీతానికి సేవ చేసేందుకు రామోజీరావు రూపంలో తనకు కొత్త దారిని చూపించినట్లు చెప్పారు. ఎందరో ఔత్సాహిక గాయకులు ‘పాడుతా తీయగా' ద్వారా వస్తున్నారంటే అది సంగీతాభిమానులు చేసుకున్న పుణ్యంగా బాలు అన్నారు

    బాధతో బాలు

    బాధతో బాలు

    కళలను, మన సంగీతాన్ని కాపాడుకునే విషయంలో సంకెళ్లు వేసుకుని నపుంసకులుగా ప్రజలు బ్రతుకుతున్నారన్న బాధను బాలు వ్యక్తం చేశారు. తమకు నచ్చని నాయకుడిపై రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజలు.. తమకు నచ్చని సినిమా, పాటను వ్యతిరేకించే విషయంలో ఎందుకు ముందుకు రారని ఆయన ప్రశ్నించారు.

    హీరోలు చెయ్యాలి

    హీరోలు చెయ్యాలి

    ‘దంగల్‌' వంటి సినిమాలు తెలుగు హీరోలు చేయాలని కోరారు. కన్నడ, తమిళుల మాదిరిగా మన తెలుగు వాళ్లకు భాష మీద ప్రేమ ఎందుకు పెరగడం లేదని తాను నిరంతరం మధనపడుతూ ఉంటానని చెప్పారు.

    ప్రజల మధ్య చేయాలి

    ప్రజల మధ్య చేయాలి

    శాస్త్రీయ సంగీత కచేరీ ప్రజల మధ్య చేయాలన్న తన జీవితాశయం తీరాలన్న ఆకాంక్ష ఉందని, దానికి దేవుడి సహకారం కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు. చాలా కాలం తర్వాత తన మనసులో భావాలను ఒక బహిరంగ వేదికపై బాలు మనసువిప్పి పంచుకోవడాన్ని కళాభిమానులు కరతాళ ధ్వనులతో నిలబడి హర్షం పిలికారు.

    అరంగ్రేటం

    అరంగ్రేటం

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే తెలియని భారతీయ సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో గాయకుడిగా ఆరంగేట్రం చేసిన బాలు.. శంకరాభరణం - ఏక్ దూజే కే లియే .. సినిమాలతో టాప్ రేంజ్ గాయకుడిగా ఎదిగారు.

    ఈ వింతమోహం

    ఈ వింతమోహం

    1966 డిసెంబరు 15న విజయ గార్డెన్‌‌స రికార్డింగ్‌ స్టూడియోలో పీబీ శ్రీనివాస్‌, రఘురామయ్య, సుశీలగార్లతో కలిసి ఏమీ ఈ వింత మోహం అంటూ బాలు తొలి పాట పాడారు. నాటి నుంచి నేటి వరకు ఆయన గళం నుంచి జాలు వారిన పాటల కుసుమాలు 40 వేల పైచిలుకే ఉన్నాయి.

    నలభై వేలుకు పైగా

    నలభై వేలుకు పైగా

    బాలసుబ్రహ్మణ్యం అతిచిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే ఆయన గాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 15 భాషల్లో 40వేలు పైగా పాటలు పాడిన ఆయన సినిమాల్లో నటుడిగాను, డబ్బింగ్ కళాకారుడిగానూ తన సత్తా చాటారు.

    ఎస్పీకు వచ్చిన అవార్డ్ లు

    ఎస్పీకు వచ్చిన అవార్డ్ లు

    తొలి హిందీ చిత్రంతోనే జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత సాగరసంగ మం, రుద్రవీణ, ఏక్‌ తుజే కేలియే(హిందీ) సంగీత సాగర శ్రీ గాన యోగి పంచాక్షరి(కన్నడ) మిస్సార కనవు(తమిళ) చిత్రాలకు గాయకుడిగా జాతీయ అవార్డులు లభించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీతోనూ, 2011లో పద్మవిభూ షణ్‌తోను సత్కరించింది. 1999లో పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ అందిస్తే, 2009లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. ఇంకా తమిళనాడు ప్రభుత్వం వారి కలైమామణి పురస్కారం, బెంగుళూర్‌లో సంగీత గంగ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తి, చెనై్న సత్యభామ విశ్వ విద్యాలయం వారి గౌరవ డాక్టరేట్‌, జె.ఎన్‌.టి.యు. నుంచి గౌరవ డాక్టరేట్‌, లతా మంగేష్కర్‌ పురస్కారం పి. సుశీల జాతీయ పురస్కారం ఇలాంటివి ఎన్నో ఆయనను వరించాయి.

    ఆ రోజే పాడటం మానేస్తా

    ఆ రోజే పాడటం మానేస్తా

    ఆ మధ్యన ఆయన తన మనసులోని భావాలను మీడియాతో పంచుకుంటూ.. ఎప్పుడైతే నేను సరిగా పాడలేక పోయాను.... పాటకి న్యాయం చేయలేకపోయాను అని అనిపిస్తే ఇక పాడడం మానేస్తానని అన్నారు. రికార్డింగ్ కు అరగంట ముందే స్టూడియోకు చేరుకోవడం తనకుమ ముందు నుండీ అలవాటు అని, డైరెక్టర్ పెద్దవాళ్లా చిన్నవాడా అనేది అతడికి సంబంధం లేదు. పాటే లోకంగా పనిచేయడమే తనకు తెలుసన్నారు.

    పెద్దగా కోరికలు లేవు

    పెద్దగా కోరికలు లేవు

    కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడం వల్ల తన కుటుంబం, పిల్లల విషయంలో సరిగా శ్రద్ధ పెట్టలేక పోయాను అని చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయనందుకు, శాస్త్రీయ సంగీతం నేర్చుకోనందుకు తాను ఇప్పటికీ బాధ పడుతున్నట్లు తెలిపారు. తన ఫేవరెట్ గాయకుడు ఎప్పటికీ మహ్మద్ రఫీయే అని తెలిపారు. పాడినంతకాలం తాను సంతోషంగా ఉంటానని, అంతకు మించి తనకు పెద్దగా కోరికలు ఏమీ లేవన్నారు

    బహుముఖ ప్రతిభ

    బహుముఖ ప్రతిభ

    గాయకుడిగానే కాకుండా డబ్బింగ్‌ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేసి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నాడు. పద్మశ్రీ, పద్మభూషన్‌ వంటి దేశ అత్యుత్తమ పురస్కారాలను అందుకోవడంతో పాటు ఆరు జాతీయ అవార్డులు, 29 నంది అవార్డులను అందుకున్న మహనీయుడు ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం.

    ఏకైక సింగర్ ఆ విషయంలో

    ఏకైక సింగర్ ఆ విషయంలో

    బీబీసీ రేడియో బాలుతో ముఖాముఖి నిర్వహించింది. ఇందులో దక్షిణాది కళాకారుడి ఇంటర్వూ ప్రసారం కావడం తొలిసారి. ఇలాంటి ఘనత మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బాలూకే దక్కింది. కమెడియన్‌‌స నుంచి స్టార్‌ హీరోల వరకూ అందరి గొంతునూ పాట పాడగల ఏకైక సింగర్‌ బాలు. 1981 ఫిబ్రవరి 8వ తేదీన ఒకేసారి 17 పాటలు పాడి రికార్డ్ ను సృష్టించారు. అలాగే తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలను ఒక్కొక్క రోజు చొప్పున పాడి శభాష్ అనిపించుకున్నారు.

    English summary
    Speaking at a function organised by Rotary Club in Vijayawada, SP. Balasubrahmaniam revealed many things. Amir Khan alone can make a film like Dangal and why can’t Tollywood come with such films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X