Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మీరు తల్లిలా కనిపించడం లేదు: సింగర్ సునీత ఫోటోకు కామెంట్స్!
ప్రముఖ తెలుగు సింగర్ ఫేస్ బుక్ పేజీలో తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటో పోస్టు చేశారు.
Recommended Video
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. ప్రేక్షకులను మైమరిపించే గానం మాత్రమే కాదు, ఆకట్టుకునే రూపం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తాజాగా సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు. సాధారణంగా ఎప్పుడూ చీరలో కనిపించే ఆమె ఈ ఫోటోలో జీన్స్, టాప్ వేసుకుని దర్శనమిచ్చారు. ఈ ఫోటోపై అభిమానుల నుండి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
మీరు తల్లిలా కనిపించడం లేదు
ఈ ఫోటోలో మీ పక్కన ఉన్న ఇద్దరు మీ పిల్లలు అంటే నమ్మలేక పోతున్నాం. మీరు వారికి తల్లిలా లేరు, సోదరిలా ఉన్నారు అంటూ కొందరు అభిమానులు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కార్తీక దీపోత్సవంలో సునీత
ఇటీవల ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ సునీత. సాంప్రదాయ చీరకట్టులో ఆమె చూపరులను ఆకట్టుకున్నారు.
ఇంప్రెస్ చేయడాని కాదు...
నాకు సంప్రదాయ దుస్తులు ధరించడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా జూట్ కాటన్ సారీస్ అంటే ఎంతో ఇష్టం. ఎవరినీ ఇంప్రెస్ చేయాలని మాత్రం కాదు, కంఫర్ట్‌గా ఉండటంతో పాటు స్టైల్‌గా ఉంటాయి కాబట్టే నేను ఎక్కువగా సారీస్ కడతాను అని సింగర్ సునీత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కలర్‌ఫుల్ లైఫ్
ఎవరైనా మహిళలు నలుపురంగు దుస్తువులు ధరించారంటే... వారు కలర్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని అర్థం. ఇది నిజమా? అని నన్నె ఎవరైనా అడిగితే నేను ఎస్ అని చెబుతాను. ఎందుకంటే నాకు నలుపు రంగం అంటే చాలా ఇష్టం.... అని సింగర్ సునీత తెలిపారు.