సంతోషం, దు:ఖం: సింగర్ సునీత 2014 అనుభవాలు
హైదరాబాద్: మరి కొన్ని గంటల్లో 2015 సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు 2014 సంవత్సరం అనుభవాలను, జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ సునీత తన అనుభవాలను సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

2014 సంవత్సరంలో నా సమయం ఎక్కువగా షూటింగులు, టూర్స్, కొత్త ప్రోగ్రామ్స్‌తో స్పెండ్ చేసాను. అవన్నీ మోస్ట్ మెమోరబుల్ మూమెంట్స్. ఈ సంవత్సరం నా ప్రయాణంలో ఎంతో మందిని కలిసాను. ఎంతో మంది కొత్త స్నేహితులను సంపాదించుకున్నాను. పలు హిట్ సాంగులు కూడా నా ఖాతాలో చేరాయి అని తెలిపారు. ఇదంతా ఈ సంవత్సరంలోని హ్యాపీయెస్ట్ పార్ట్.
అదే సమయంలో ఈ సంవత్సరం ఎంతో మంది ప్రముఖులను కోల్పోయాం. నా మనసుకు ఎంతో బాధ కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఈ సంవత్సరంలోని సాడ్ పార్ట్. జీవన ప్రయాణంలో ఇలాంటివి చోటు చేసుకోవడం సహజమే. అందరం కలిసి కొత్త ఆలోచనలు, నమ్మకాలతో 2015కు స్వాగతం పలుకుదాం అంటూ సునీత్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











