నిశ్చితార్థం అనంతరం నా పిల్లల్లో కోపం.. కానీ అప్పటికే అంతా జరిగిపోయింది: సింగర్ సునీత
గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు సునీత. ఆమె రెండో వివాహంపై అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఆమె చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి మ్యాటర్ పై పలు సందర్భాల్లో సున్నితంగానే స్పందించిన సునీత అలాంటి సందర్భం వస్తే ముందే చెబుతానని క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఒకరోజు సడన్ గా ఎంగేజ్మెంట్ జరగడంతో అందరూ షాక్ అయ్యారి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిశ్చితార్థం తరువాత జరిగిన కొన్ని ఘటనలపై సునీత స్పందించారు.

ఆ ఉదయమే ఫొటోస్ వైరల్
నిశ్చితార్థం నెల రోజుల ముందు నుంచే సునీత పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే చాలా వరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత అప్పుడు పెద్దగా స్పందించకపోవడంతో రూమర్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఒకరోజు ఉదయమే సోషల్ మీడియాలో ఆమె నిశ్చితార్థ వేడుక కూడా జరిగిందని కొన్ని ఫొటోస్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

ఆ ఫొటోస్ లీక్.. అస్సలు తెలియదట
ఫొటోస్ బయటకు వచ్చిన విషయం సునీతకు తెలియదట. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు. ఫొటోస్ లీక్ అయిన మరుక్షణమే సునీత అధికారికంగా వివరణ ఇచ్చారు. సునీత అధికారికంగా క్లారిటీ ఇవ్వడమే కాకుండా కాబోయే భర్త గురించి కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఇంకేంటి.. ఇలాగే ఉంటావా?
ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న సునీత నిశ్చితార్థం సంగతి తన పిల్లలకు ఏ మాత్రం తెలియదని కూడా చెప్పేసింది. రామ్ చాలా రోజులుగా తెలిసినప్పటికీ.. తన నుంచి ఎప్పుడైనా ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేసేదాన్ని కాదని కేవలం వృత్తిపరమైన పనులు ఉంటేనే ఆన్సర్ ఇచ్చేదాన్ని అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒకసారి ఫోన్ చేస్తే 'ఇంకేంటి.. ఇలాగే ఉంటావా? లేక పెళ్లి గురించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా?' అని రామ్‌ని అడిగానని సునీత తెలిపింది.

రామ్ ఆ సమాధానం ఇవ్వడంతో
దానికి ఆయన 'నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఏడేళ్ల నుంచి పరోక్షంగా నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను' అని రామ్ సమాధానం ఇవ్వడంతో ఆ తరువాత అమ్మానాన్న, నా పిల్లలతో మాట్లాడి వారి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు సునీత చెప్పారు. పిల్లలు ఎంతగానో సంతోషించినట్లు కూడా వివరణ ఇచ్చారు.

నా పిల్లల్లో కోపం కనిపించింది.. కానీ..
అయితే ఒక రోజు రామ్ వాళ్ల కుటుంబ సభ్యులు సడన్ గా ఇంటికి వచ్చి తాంబూలం అందించి మా పేరెంట్స్ తో మాట్లాడారు. ఆ విషయం ముందుగా నా పిల్లలకు తెలియదు. అయితే నేను ఒకరోజు సడన్ గా ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కోపంగా ఉన్నట్లు అనిపించింది. నీ లైఫ్ లో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మాకు ఎందుకు చెప్పలేదు. ముందే ఎంగేజ్మెంట్ అని చెబితే మేము కొత్త బట్టలతో రెడీగా ఉండేవాళ్ళం కదా అని నాతో అన్నారు. వాళ్ళు నా పరిస్థితిని ఎంతగానో అర్థం చేసుకున్నారు అని సునీత వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











