రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సునీత.. అతన్ని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం చెబుతూ..

తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అమృత గాయని సునీత రెండో వివాహంపై ప్రస్తుతం అనేక రకాల కథనాలు వస్తున్నాయి. పెళ్లి మ్యాటర్ పై పలు సందర్భాల్లో సున్నితంగానే స్పందించిన సునీత అలాంటి సందర్భం వస్తే ముందే చెబుతానని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆమె నిశ్చితార్థం చేసుకున్న కొన్ని గంటల తరువాత అధికారికంగా పెళ్లిపై వివరణ ఇచ్చారు.

ఉదయమే ఫొటోస్ వైరల్

ఉదయమే ఫొటోస్ వైరల్

గత వారం రోజులుగా సునీత పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా వరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత ఈ సారి పెద్దగా స్పందించకపోవడంతో రూమర్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ ఉదయం నుంచే సోషల్ మీడియాలో ఆమె నిశ్చితార్థ వేడుక కూడా జరిగిందని కొన్ని ఫొటోస్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ కు గురయ్యారు.

స్థిరపడాలని కోరుకుంటున్నాను

స్థిరపడాలని కోరుకుంటున్నాను

ఇక ఫైనల్ గా రెండో వివాహంపై సునీత అధికారికంగా క్లారిటీ ఇవ్వడమే కాకుండా కాబోయే భర్త గురించి కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ప్రతి తల్లిలాగే నేను కూడా నా పిల్లలు జీవితాల్లో అనుకున్నట్లుగా సరైన పద్దతిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇక నేనూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని నా తల్లిదండ్రులు, పిల్లలు కోరుకుంటున్నారు. అలాంటి వారు నాకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు తెలిపారు.

రామ్‌ నా లైఫ్ లోకి వచ్చినందుకు..

రామ్‌ నా లైఫ్ లోకి వచ్చినందుకు..

అదే విధంగా నా జీవితంలో ఒక మధుర క్షణం ప్రారంభమైంది. నన్ను క్షేమంగా చూసుకునే స్నేహితుడిగా.. అద్భుతమైన సహచరుడిగా రామ్‌ నా లైఫ్ లోకి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతిత్వరలోనే మేము వివాహబంధంతో ఒకటి కాబోతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచానని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను సపోర్ట్‌ చేయగలరని ఆశిస్తున్నా' అని సునీత వివరణ ఇచ్చారు.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
మొదటి పెళ్లి 19ఏళ్ల వయసులోనే..

మొదటి పెళ్లి 19ఏళ్ల వయసులోనే..

సింగర్ సునీతకు 19ఏళ్ల వయసులోనే మీడియాలో వర్క్ చేసే ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి కొడుకు, కూతురు కూడా జన్మించారు. అయితే కొన్నేళ్ల తరువాత మనస్పర్థల కారణంగా చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. సునీత వద్దనే పిల్లలు టీనేజ్ వయసును దాటి వచ్చేశారు. కూతురు సింగర్ గా కూడా కొనసాగుతోంది. ఇక గతంలో ఆమె పెళ్లిపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X