పెళ్లి అనగానే పిల్లలే గుర్తొచ్చారు.. రామ్ అలా తెలుసు.. హనీమూన్ ఎప్పుడంటే: సింగర్ సునీత

గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న సింగర్ సునీత. ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సింపుల్ గా ఒక గుడిలో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సునీత వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆమె మొదటిసారి భర్త గురించి ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

అప్పుడే క్లారిటీ ఇచ్చిన సునీత

అప్పుడే క్లారిటీ ఇచ్చిన సునీత

గత నెల రోజులుగా సునీత పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా వరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత ఈ సారి కూడా త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఎంగేజ్మెంట్ వేడుకతో క్లారిటీ ఇచ్చేసింది. ఇక జనవరి 9న హిందు సంప్రదాయం ప్రకారం శంషాబాద్ లోని సీతారాముల గుడిలో రామ్ ను వివాహం చేసుకున్నారు.

అలాంటి వారు నాకున్నందుకు..

అలాంటి వారు నాకున్నందుకు..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత ఈ విధంగా వివరణ ఇచ్చారు. ప్రతి తల్లిలాగే నేను కూడా నా పిల్లలు జీవితాల్లో అనుకున్నట్లుగా సరైన పద్దతిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇక నేనూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని నా తల్లిదండ్రులు, పిల్లలు కోరుకుంటున్నారు. అలాంటి వారు నాకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు తెలిపారు.

అలానే పరిచయమయ్యాడు

అలానే పరిచయమయ్యాడు

అదే విధంగా నా జీవితంలో ఒక మధుర క్షణం ప్రారంభమైంది. నన్ను క్షేమంగా చూసుకునే స్నేహితుడిగా.. అద్భుతమైన సహచరుడిగా రామ్‌ నా లైఫ్ లోకి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి అతను నా సోషల్ మీడియా ఎకౌంట్స్ ను చూసుకునేవారు. అలానే పరిచయమయ్యాడు.

మొదట్లో స్నేహంగా ఉన్నాము..

మొదట్లో స్నేహంగా ఉన్నాము..

మొదట్లో స్నేహంగా ఉన్న మా బంధం ఆ తరువాత మరింత ముందుకు వెళ్లింది.మా బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని అనుకున్నాము. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు. ఇరు కుటుంబాలతో ముందుగా చాలా చర్చించాము. ఆ తరువాత పెద్దలు, పిల్లల అంగీకారాన్ని గౌరవించి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము.

పెళ్లి అనగానే పిల్లలే గుర్తొచ్చారు

పెళ్లి అనగానే పిల్లలే గుర్తొచ్చారు

రామ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మొదట నా పిల్లలు గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నా నిర్ణయం వారికి ఇబ్బందిగా అనిపించకూడదు. అలాగే నా జీవితానికి కూడా అర్థం చేసుకునే తోడు ఉండడం చాలా ముఖ్యం. రామ్ ఆ విషయంలో ఒక మంచి స్నేహితుడిగా కూడా సపోర్ట్ గా ఉంటాడని అర్ధమయ్యింది. నేను చాలా అదృష్టవంతురాలిని.

పిల్లలకు పెళ్లి విషయం గురించి చెప్పగానే..

పిల్లలకు పెళ్లి విషయం గురించి చెప్పగానే..

పిల్లలకు పెళ్లి విషయం గురించి చెప్పగానే వాళ్ళు ఎంతగానో సంతోషించారు. నన్ను కౌగిలించుకొని మంచి నిర్ణయం తీసుకున్నావు అని ఆనందపడ్డారు. అలాంటి పిల్లలు నాకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నా పిల్లలు ఎంతో పరిణితి చెందారని అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలిచిందని.. సునీత వివరణ ఇచ్చారు.

హనీమూన్ ఎప్పుడంటే..

హనీమూన్ ఎప్పుడంటే..

ఇక హనీమూన్ ఎప్పుడనే ప్రశ్నకు సునీత సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని, పెళ్లికి ఎంతో మంది రావాల్సింది. కానీ కోవిడ్ వలన ఎక్కువమందిని పిలవలేదని చెప్పారు. ఇక త్వరలో విడివిడిగా చిన్న చిన్న పార్టీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతూ అవన్నీ పూర్తయిన తరవాత హనీమూన్ గురించి ఆలోచిస్తామని సునీత వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X