కలకాలం స్నేహితులమే.. వారిపై సింగర్ సునీత కామెంట్స్
పెళ్లి తరువాత సింగర్ సునీత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. సునీత రామ్ వీరపనేని వివాహాం సోషల్ మీడియాలో ఎంతటి హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. సునీత రెండో పెళ్లి సమర్థించిన వారు కొందరైతే.. అలా చేయడమేంటని ఇంకొందరు ట్రోల్స్ చేశారు. కానీ సునీత మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం మునుపటి కంటే ఎక్కువగా యాక్టివ్ అవుతోంది. సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో సందడి చేస్తోంది.

పెళ్లిలో అలా..
సునీత తన పెళ్లిలో ఎంత సంతోషంగా ఉందో తెలియజేసేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన భర్త్ రామ్‌తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సునీత సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకు ముందు తన ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్న హల్దీ ఈవెంట్ ఫోటోలను షేర్ చేసింది. అలా తాను ఈ పెళ్లితో ఎంత సంతోషంగా ఉందో చెప్పకనే చెప్పేసింది.

పెళ్లి తరువాత ఇలా..
సునీత తన వివాహాం తరువాత స్పెషల్ పోస్ట్‌లను చేస్తూ వచ్చింది. వివాహానంతర జీవితం ఎలా ఉందో చూపిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కాఫీ తాగుతున్న ఫోటోలను, ఇంటి గార్డెన్‌లో కూరగాయల మొక్కల్లో సందడి చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ కొటేషన్‌లను షేర్ చేసింది.

సునీత స్నేహితులు..
సింగర్ సునీతకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు. సింగర్, హోస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీతకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది. హెస్ట్, యాంకర్, నటి అయిన అనితా చౌదరి అప్పట్లో ఫుల్ ఫేమస్. అనితా చౌదరికి, సునీతకు మంచి స్నేహ బంధం ఉంది.

సుమతోనూ అంతే..
ఇక యాంకర్ సుమతో అయితే సునీత బంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య స్నేహ బంధం గురించి కూడా అందరికీ విదితమే. అయితే తాజాగా సునీత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సునీత పెళ్లిలో ఈ ఇద్దరూ కూడా మెరిసిన సంగతి తెలిసిందే..

ఎప్పటికీ స్నేహితులే..
ఇక సునీత పెళ్లిలో సుమ, అనిత చౌదరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ పెళ్లి నాటి ఫోటోలను షేర్ చేస్తూ సుమ, అనితలపై సునీత కామెంట్ చేసింది. కలకాలం స్నేహితులమే అంటూ ఇద్దరినీ తలుచుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో రేణూ దేశాయ్ మిస్ అయినట్టుంది.


Click it and Unblock the Notifications











