twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వేధింపులు నేను కూడా ఎదుర్కొన్నాను: సింగర్ సునీత

    సినిమా ఇండస్ట్రీలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు తరచూ వింటూనే ఉంటాం. సింగర్ సునీత కూడా తన కెరీర్లో పలు సందర్భాల్లో ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

    By Bojja Kumar
    |

    హాలీవుడ్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ ఉదంతం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చ సాగుతోంది. మీటూ అనే హాష్ ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు, మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, సెక్సువల్ హారాస్మెంట్ గురించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

    హార్వీ వెయిన్‌స్టన్ పలువురు హలీవుడ్ టాప్ హీరోయిన్లను లైంగిక వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో ఈ ట్రెండింగ్ టాపిక్ గురించి ప్రశ్నించడం, ఆయా నటీమణులు తమకు ఎదురైన సంఘటనల గురించి వెల్లడిస్తుండటం ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు.

    టాలీవుడ్లో కూడా

    టాలీవుడ్లో కూడా

    హాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు... టాలీవుడ్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. కొందరు నటీమణులు ఇలాంటి విషయాలను పలు సందర్భాల్లో మీడియా దృష్టికి తెచ్చారు కూడా.

    అలాంటి వారు ప్రతి చోటా ఉంటారు

    అలాంటి వారు ప్రతి చోటా ఉంటారు

    ఇండస్ట్రీలో ‘‘సెలబ్రిటీ అనే వారు ఏదో ఒక విషయంలో వేధింపులకు గురవుతూనే ఉంటారు. నా పట్ల కూడా కొందరు మిస్ బిహేవ్ చేశారు" అని సింగర్ సునీత చెప్పినట్లు ఓ ప్రముఖ పత్రికకు చెందిన వెబ్ సైట్లో పేర్కొంది.

    మాట్లాడకుండా వెళ్లిపోయేదాన్ని

    మాట్లాడకుండా వెళ్లిపోయేదాన్ని

    నన్ను ఎవరైనా వేధింపులకు గురి చేస్తున్నట్లు, తప్పడు ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు అనిపిస్తే వెంటనే వారికి దూరంగా, మాట్లాడకుండా వెళ్లే దాన్ని.... అని సింగర్ సునీత చెప్పినట్లు తెలుస్తోంది.

    వృత్తి పరంగా ఇలాంటి సమస్యలు లేవు

    వృత్తి పరంగా ఇలాంటి సమస్యలు లేవు

    ఇలాంటి విషయాల్లో కొందరు కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవారు. ఇలాంటివి ఎన్నో అనుభవించాను. అయితే వృత్తిపరంగా మాత్రం ఎప్పుడూ ఇలాంటివి ఫేస్ చేయలేదని సునీత చెప్పినట్లు తెలుస్తోంది.

    English summary
    Singer Sunita also experienced Teasing and Harassment. Sunitha has revealed some of the incidents and opened up how it has affected her. She has also revealed how she used to overcome of all these.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X