Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలాంటి వేధింపులు నేను కూడా ఎదుర్కొన్నాను: సింగర్ సునీత
సినిమా ఇండస్ట్రీలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు తరచూ వింటూనే ఉంటాం. సింగర్ సునీత కూడా తన కెరీర్లో పలు సందర్భాల్లో ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ ఉదంతం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చ సాగుతోంది. మీటూ అనే హాష్ ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు, మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, సెక్సువల్ హారాస్మెంట్ గురించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
హార్వీ వెయిన్‌స్టన్ పలువురు హలీవుడ్ టాప్ హీరోయిన్లను లైంగిక వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో ఈ ట్రెండింగ్ టాపిక్ గురించి ప్రశ్నించడం, ఆయా నటీమణులు తమకు ఎదురైన సంఘటనల గురించి వెల్లడిస్తుండటం ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు.
టాలీవుడ్లో కూడా
హాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు... టాలీవుడ్‌లోనూ ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. కొందరు నటీమణులు ఇలాంటి విషయాలను పలు సందర్భాల్లో మీడియా దృష్టికి తెచ్చారు కూడా.
అలాంటి వారు ప్రతి చోటా ఉంటారు
ఇండస్ట్రీలో ‘‘సెలబ్రిటీ అనే వారు ఏదో ఒక విషయంలో వేధింపులకు గురవుతూనే ఉంటారు. నా పట్ల కూడా కొందరు మిస్ బిహేవ్ చేశారు" అని సింగర్ సునీత చెప్పినట్లు ఓ ప్రముఖ పత్రికకు చెందిన వెబ్ సైట్లో పేర్కొంది.
మాట్లాడకుండా వెళ్లిపోయేదాన్ని
నన్ను ఎవరైనా వేధింపులకు గురి చేస్తున్నట్లు, తప్పడు ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు అనిపిస్తే వెంటనే వారికి దూరంగా, మాట్లాడకుండా వెళ్లే దాన్ని.... అని సింగర్ సునీత చెప్పినట్లు తెలుస్తోంది.
వృత్తి పరంగా ఇలాంటి సమస్యలు లేవు
ఇలాంటి విషయాల్లో కొందరు కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవారు. ఇలాంటివి ఎన్నో అనుభవించాను. అయితే వృత్తిపరంగా మాత్రం ఎప్పుడూ ఇలాంటివి ఫేస్ చేయలేదని సునీత చెప్పినట్లు తెలుస్తోంది.