twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత.. అందుకే అలా చేశామంటూ వివరణ

    |

    ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ కరోనా తన ధాటిని పెంచుకుంటూ పోతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం కూడా ప్రకటించింది. ఇలాంటి తరుణంలో ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే తరుణంలో ఇలా మళ్లీ కరోనా దాడి చేస్తోంది.

    కఠిన నిబంధనలు..

    కఠిన నిబంధనలు..

    కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మళ్లీ లాక్డౌన్ పెట్టే ఆలోచనలు అయితే ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ కోవిడ్ నిబంధనలు మాత్రం కఠినంగా అమలు పరిచేందుకు చర్యలు మొదలు పెట్టారు. సమావేశాలు, సభలు వంటి వాటిని నిర్వహించకూడదని, ప్రజలు మాస్క్‌ను కచ్చితంగా ధరించాలని ఆదేశించారు.

    మ్యూజికల్ కాన్సర్ట్..

    మ్యూజికల్ కాన్సర్ట్..

    అయితే సినిమా ఈవెంట్లు, మ్యూజికల్ కాన్సర్ట్‌లు కూడా ఇలాంటి సమయంలో పెట్టడం కరెక్ట్ కాదు. కరోనా కట్టలు తెంచుకుని విజృంభిస్తోన్న తరుణంలో ఇలాంటి ఈవెంట్లను రద్దు చేసుకోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు. అలా సునీత కూడా తమ ఈవెంట్‌ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది.

    క్షమాపణలు..

    క్షమాపణలు..

    మార్చి 27న జరగాల్సిన రాక్ స్టార్ ఈవెంట్స్‌ను రద్దు చేశాం.. మమ్మల్ని క్షమించండి అని సునీత చెప్పుకొచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటివి ఎవ్వరికీ శ్రేయస్కరం కావని భావించి ఈవెంట్‌ను రద్దు చేశాం.. మీ అందరూ సహాయ సహకారాలు ఇచ్చినందుకు థ్యాంక్స్.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని సునీత చెప్పుకొచ్చింది.

     స్పెషల్ ఈవెంట్..

    స్పెషల్ ఈవెంట్..

    సింగర్ సాకేత్, రమ్య బెహెరా, అనురాగ్ కులకర్ణి, గీతా మాధురి, శ్రీకృష్ణ, సాహితి, రేవంత్ ఇలా టాలీవుడ్ స్టార్ సింగర్స్ అందరి ఆధ్వర్యంలో మణిశర్మ అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అదంతా తారుమారైంది.

    English summary
    Singer Sunitha Apologize For cancel Music concert
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X