గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. ఆ ఫోటోతో ఇన్ డైరెక్ట్ హింట్.. మళ్ళీ తల్లవుతోందా?

తెలుగు సింగర్ సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అయితే ఆమె పాడే పాటల కంటే కూడా ఎక్కువగా తన అందంతో అలాగే వివాదాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించారు. ఆమె మొదటి భర్త నుంచి విడిపోయి ఏకాంత జీవితం గడపడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో ఆమె పేరు లాగుతూ రెండో పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ వచ్చేవి వెబ్ మీడియా పోర్టల్స్. ఈ మధ్య కాలంలో రెండో వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు మళ్ళీ అమ్మను అవుతున్నాను అంటూ ఒక హింట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

''గులాబీ''

''గులాబీ''

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ''గులాబీ'' సినిమాలో ''ఈ వేళలో నీవు'' పాటతో సింగర్ గా మారిన సునీత ఆ తర్వాత అనేక వందల పాటలు పాడి ఎంతో మంది తెలుగు వారిని తన అభిమానులుగా మార్చుకున్నారని చెప్పక తప్పదు. ఆమె కేవలం పాటలు పాడడం వరకే పరిమితం కాకుండా అనేక సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది.

ఇద్దరు పిల్లలు కూడా

ఇద్దరు పిల్లలు కూడా

19 ఏళ్ల వయసులో కిరణ్‌కుమార్‌ గోపరాజు అనే దగ్గరి బంధువుల కుర్రాడిని ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే, మనస్పర్థల కారణంగా ఈ ఇరువుడూ 2017లో విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని గడిపారు.

తనదైన శైలిలో కౌంటర్

తనదైన శైలిలో కౌంటర్

అయితే సింగర్ సునీత కరోనా కాలంలో రామ్ అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ అధినేతను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు. అయితే ఈ వివాహం ఎవరూ ఊహించని విధంగా జరగడంతో అడపా దడపా వారి మీద ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో సునీత అయితే అందరి నోరు మూయించారు.

చర్చనీయాంశం

చర్చనీయాంశం

అయితే సునీత ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీబిజీగా గడుపుతూనే తన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. ఇక ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబందించిన అనేక విషయాలను ఆమె షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఒక ఫోటో చర్చనీయాంశం అయింది.

బ్లెస్స్డ్ అంటూ

బ్లెస్స్డ్ అంటూ

శనివారం ఉదయం ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఆ ఫోటోలు, ఫోటోలకు పెట్టిన కాప్షన్ ఆమె కడుపుతో ఉన్నదన్న రూమర్‌కు తెరతీసింది. ఆ ఫొటోలో సునీత మామిడి చెట్టు దగ్గర కూర్చుని ఓ మామిడి కాయను చేతిలో పట్టుకుని కనిపిస్తోంది. దానికి తోడు బ్లెస్స్డ్ అంటూ ఆ ఫోటోలకు కామెంట్ పెట్టడం ఇప్పుడు ఆమె గర్భవతి అయి ఉండవచ్చనే వాదనకు తెర తీసింది.

కంగ్రాట్స్ అంటూ

కంగ్రాట్స్ అంటూ

ఎందుకంటే సాధారణంగా కడుపుతో ఉన్న వాళ్ళు పులుపు తినడానికి ఇష్టపడతారు, ఈ క్రమంలోనే సునీత తాను ఇన్‌డైరక్ట్‌గా కడుపుతో ఉన్నానన్న సంగతి చెబుతోందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొందరు అయితే ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మొన్నీమధ్య యాంకర్ శివ జ్యోతి కూడా మామిడికాయల ఫోటోలు పెట్టగా ఆమె గర్భవతి అని ప్రచారం జరిగింది. తర్వాత ఆమె అదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X