45 ఏళ్ల వయసులో మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్!
సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తారు. వారి ప్రొఫెషనల్ కెరీర్ విషయాలతో కంటే పర్సనల్ లైఫ్ విషయాలతోనే కాంట్రవర్సీలో నిలుస్తున్నారు. అలా ఓ ప్రముఖ సింగర్ నిత్యం తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా 45 ఏండ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరనే వివరాల్లోకెళ్తే..
ఆ సింగర్ ఎవరో కాదు సునీత. సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె పాట వింటే పరవశంలో తేలిపోవాల్సిందే. ఆమె తన మధురమైన గొంతుతో శ్రోతలను మైమరిపిస్తుంది. మధురమైన గాత్రం మాత్రమే కాదు.. అందమైన రూపం ఆమె సొంతం. ఎన్నో వేల పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సింగర్ సునీత.ఆమె కేవలం 19 ఏళ్ల వయసులోనే సినీ కెరీర్ ను ప్రారంభించింది.

సింగర్ సునీత కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3000లకు పైగా పాటలు పాడింది. ఈమె ఏ పాట పాడిన ప్రత్యేకమే. మెయిన్ గా గులాబీ సినిమాలో 'ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు..' అనే పాటకు ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. సునీత కేవలం గాయని మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె ఇప్పటివరకు దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పి మెప్పించింది.ఇలా ఎన్నో వేల పాటలు పాడిన సునీత రియాల్టీ షో లలో జడ్జిగా కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
ఇక సునీత వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 19 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఆకాష్ శ్రేయ. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. గత మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది సునీత. ఇక ఆమె కొడుకు ఇటీవల 'సర్కార్ నౌకరి' అంటూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇలా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సక్సెస్ గా కొనసాగిస్తుంది. సునీత తన అద్భుతమైన గోత్రంతో శ్రోతలను అలరించడమే కాదు. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సింగర్ నిత్యం తన ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకున్న నుండి సోషల్ మీడియాలో పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. 45 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన ఆ రూమర్సు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఇలాంటి పుకార్లు చేయడంతో సింగర్ సునీత రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతుంది. ఎంత ఫైర్ అయినా పుకార్లు ఆగకపోవడంతో వాటిని పట్టించుకోవడం మానేసిందట.


Click it and Unblock the Notifications











