Don't Miss!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిపై.... సింగర్ సునీత ఫైర్!
ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, అందంగా ఉండటం, ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ కావడం ఇందుకు కారణం అయుండొచ్చు. సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోదు.
తన మనసుకు చాలా బాధ కలిగించే అశాలపై తప్ప ఆమె రియాక్ట్ అవ్వరు. ఆ మధ్య తాను మరో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాజాగా ఆమె స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాటలను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.
స్వరూపానందేంద్ర సరస్వతిపై కోపానికి కారణం?
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... తన వద్దకు సినీ ప్రముఖులు వస్తుంటారని... చిరంజీవి, రజనీకాంత్ వచ్చారని, రాజేంద్రప్రసాద్ అబ్బాయి జగదీష్ వస్తుంటారు, సింగర్ సునీత కూడా వస్తుంటారని వ్యాఖ్యానించారు. తాను రాకున్నా తన పేరు చెప్పడంతో సునీతకు కోపం వచ్చింది.
నా పేరు ఎలా చెబుతారు?
‘రోజూ ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కానీ అన్నింటిపై స్పందించాలని అనుకోము. కానీ కొన్ని విషయాలపై తప్పకుండా స్పందించాలి. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చేర్చడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో... ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఈ పోస్టు పెడుతున్నాను, నేను అతడిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదు' అంటూ సునీత వ్యాఖ్యానించారు.
సునీతకు మద్దతుగా కామెంట్స్
ఈ విషయంలో సునీతకు మద్దతుగా పలువురు అభిమానులు స్పందించారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేస్తే ఇంకా చాలా మంది పేర్లు చెప్పి బతికేస్తుంటారు. మీరు సరైన విధంగా కౌంటర్ ఇచ్చారు. మీకు మేము మద్దతుగా ఉన్నాం... అంటూ వ్యాఖ్యానించారు.
స్వరూపానందేంద్ర సరస్వతి ఎలా స్పందిస్తారో?
సునీత చేసిన ఈ పోస్టుపై రకరకాల చర్చ జరుగుతోంది. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు తన వద్దకు రాకున్నా... సునీత పేరు ఎందుకు వాడినట్లు? ఆయన ఈ వివాదంపై ఎలా స్పందించబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అయితే స్వారూపానంద చెప్పింది సింగర్ సునీత పేరు అయి ఉండక పోవచ్చని మరికొందరి వాదన.