కరోనా వస్తే ముందు హాస్పిటల్‌కి వెళ్లి చావు!..పబ్లిసిటీ అవసరమా.. నెటిజన్ల కామెంట్లపై సునీత ఫైర్

ఒక్కోసారి సోషల్ మీడియాలో మంచి చేసినా మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడేది చెప్పినా సరే దాంట్లోనూ వంకలు పెడుతుంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు అయితే ఇలాంటి పరిస్థితులు నిత్యం ఎదురువతుంటాయి. అందులోనూ మరీ ముఖ్యంగా మహిళా ప్రముఖులకు అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం సింగర్ సునీతకు అలాంటే ఓ చేదు అనుభవమే ఎదురైంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

సునీతకు కరోనా..

సునీతకు కరోనా..


ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగర్స్‌కు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. వరుసబెట్టి సింగర్స్ అందరికీ కరోనా సోకుతోంది. స్మిత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాళవిక, సునీత ఇలా అందరూ కరోనా బారినపడ్డారు. అందులో స్మిత కోలుకున్నట్టు చెప్పుకొచ్చింది.

 కరోనాపై వీడియో..

కరోనాపై వీడియో..

తనకు కరోనా సోకిందనే వార్తలు వైరల్ అవుతుండటంతో సునీత రంగంలోకి దిగింది. తన ఆరోగ్యం, కరోనా అనుభవాలను చెప్పేందుకు ఫేస్ బుక్‌లో ఓ వీడియోను పెట్టింది. కరోనా వచ్చిందని, క్షేమంగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇందులో సునీత ఎక్కువగా ఆంగ్ల భాషను వాడింది. దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు.

 స్పందించిన సునీత..

స్పందించిన సునీత..

ట్రోలింగ్ చేసినవారిని ఉద్దేశిస్తూ.. అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ వీడియో యూ ట్యూబ్‌లో చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు అని సునీత పేర్కొంది.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
 హాస్పిటల్‌కు వెళ్లి చావు..

హాస్పిటల్‌కు వెళ్లి చావు..

సునీత ఇంకా మాట్లాడుతూ.. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు(కోర్టు లో ఉండేవారు కాదు) "ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కరోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావు మీడియా లో పబ్లిసిటీ కోసం అవసరమా" లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా... గాడ్ బ్లెస్ యూ అంటూ తీవ్ర అసహనానికి గురైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X