నాగ్ కేసు-సింగర్ సునీతకు ఇబ్బందులు
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు..సినీ నటుడు నాగార్జున-ఓ ఆంగ్రల పత్రిక జర్నలిస్టు సునీత చౌదరి మధ్య నెలకొన్న వివాదం, సినీ సింగర్ సునీతకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. గత రెండు రోజులుగా సునీతకు తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఈ వివాదంతో సింగర్ సునీతకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా...?. సంబంధం ఏమీ లేదు కానీ...నాగార్జునపై కేసు పెట్టిన జర్నలిస్టు సునీతను...అంతా సింగర్ సునీత అని భావిస్తున్నారట. ఈ కేసు విషయమై ఆరా తీస్తున్నారట. కొందరు అభిమానులైతే ఏకంగా ఓ అడుగు ముందుకేసి మా హీరోపై కేసు పెడతావా? అంటూ బెదిరించినంత పని చేస్తున్నారట. నాగ్‌పై కేసు పెట్టింది నేను కాదు బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదట సదరు అభిమానులు.
నాగార్జన తనను అసభ్య పదజాలంతో దూషించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఓ ఆంగ్ల పత్రికకు చెందిన జర్నలిస్టు సునీత చౌదరి గత మూడు రోజుల క్రితం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నాగార్జున విగ్గు పెట్టుకుని సినిమాల్లో నటిస్తున్నాడని సునీత గతంలో రాసిన ఓ ఆర్టికల్ ను మనసులో పెట్టుకున్న నాగార్జున ఇటీవల అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన ఆమెను దూషించాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. దీంతో ఈ సునీత సింగర్ సునీత అనుకుని ఫోన్స్ చేస్తున్నారు కొందరు.


Click it and Unblock the Notifications











