సింగర్ సునీత భర్తకు ప్రాణ హానీ.. పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది సింగర్స్ గా సత్తా చాటుతున్నారు. ఎప్పుడు కొత్త గాయనీ గాయకులు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఈ సమయంలో కొంతమంది మాత్రమే స్టార్ సింగర్ గా నిలదొక్కుకోగలుగుతున్నారు. ఎప్పుడో గాయనీగా కెరీర్ స్టార్ట్ చేసిన సునీత ప్రస్తుత కాలంలో అంతగా పాటలు పాడట్లేదు. రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ప్రస్తుతం ఫ్యామీలీతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఆమె భర్తకు ప్రాణ హానీ ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు.

టాలీవుడ్ పాపులర్ సింగర్స్ లలో సునీత ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సింగర్ సునీత 2021లో వ్యాపారవేత్త వీరపనేని రామకృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా రామకృష్ణను ఓ వ్యక్తి బెదిరంచడం మొదలు పెట్టాడు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కె.కె. లక్ష్మణ్ అనే వ్యక్తి కొన్నాళ్ల ముందు రామకృష్ణకు తాను నిర్మాతల మండలి సభ్యుడినంటూ మొబైల్ మెసేజ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.

Singer Sunitha Husband Ramakrishna Police Complaint For Threatening

తనను తాను సినీ నిర్మాతల మండలి సభ్యుడిగా పరిచయం చేసుకున్న కె.కె. లక్ష్మణ్ అదే మొబైల్ మెసేజ్ ద్వారా రామకృష్ణను పర్సనల్ గా కలిసి మాట్లాడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎవరో తెలియి వ్యక్తిని పర్సనల్ గా కలవడం ఎందుకుని భావించిన రామకృష్ణ తన ఆఫీస్ కు వచ్చి స్టాఫ్ తో విషయం చెప్పాల్సిందిగా కోరారు. అయితే అందుకు వినని లక్ష్మణ్ వరుసగా మెసేజ్ లు పంపుతూ వచ్చాడు. దీంతో లక్ష్మణ్ నెంబర్ ను బ్లాక్ చేశాడు రామకృష్ణ.

లక్ష్మణ్ నెంబర్ బ్లాక్ చేయడంతో మరో కొత్త నెంబర్ తో అతను రామకృష్ణకు మెసేజ్ లు పంపడం మొదలు పెట్టాడు. ఈసారి ఏకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక లాభం లేదనుకున్న రామకృష్ణ లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి ప్రాణ హాని ఉందని గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ ఫిర్యాదుతో లక్ష్మణ్ పై ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే సింగర్ సునీతకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు సింగర్ గా రాణించాలని ఆసక్తి చూపిస్తుంటే.. సునీత కొడుకు హీరోగా సినీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X