ఆ మోసం చేసినవాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్.. వదిలేదే లేదు: సింగర్ సునీత

సింగర్ సునీత ఎంత కూల్ గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా చాలా కూల్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రూమర్స్ డోస్ ఎక్కువైతే ఆమె అఫీషియల్ గా వివరణ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అయితే ఇటీవల మోసం చేసిన ఒక వ్యక్తిపై సింగర్ సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను అంటూ తప్పకుండా అతనిపై పిర్యాదు చేస్తానని కూడా వివరణ ఇచ్చారు.

 ఓ వ్యక్తి చేసిన మోసం

ఓ వ్యక్తి చేసిన మోసం

గాయనిగా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగానో అభిమానులను సంపాదించుకున్న సునీత ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. చైతన్య అనే వ్యక్తి సునీత పేరు చెప్పుకొని చాలా డబ్బులు గుంజుతున్నాడని ఒక కథనం ద్వారా తెలుసుకున్న సునీత ఆ విషయంపై ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉందని తెలిపారు.

బంధువు అని చెప్పుకుంటూ..

బంధువు అని చెప్పుకుంటూ..

సునీత మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాపై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కూడా లైట్ తీసుకున్నాను. నా ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచించాను. అయితే రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చూశాను. ఒక వ్యక్తికి నేను బాగా తెలుసని, అతను నా బంధువు అని కూడా చెప్పుకుంటూ అమ్మయిలను అబ్బాయిలను మోసం చేస్తున్నట్లు తెలుసుకున్నాను.

కనిపిస్తే వాడి పళ్ళు రాలిపోతాయి.

కనిపిస్తే వాడి పళ్ళు రాలిపోతాయి.

ఎంతో మంది దగ్గర అతను డబ్బులు తీసుకొని అవకాశాలు ఇస్తానని రకరకాలుగా మోసం చేస్తున్నట్లు తెలిసింది. కానీ అతను ఎవడో కూడా నాకు తెలియదు. చైతన్య అనే అబ్బాయి నా ఫ్యామిలీలో ఎవరు లేరు. వాడిని ఎన్నడు చూడలేదు. వాడు ఎవడో కనిపిస్తే తప్పకుండా వాడి పళ్ళు మాత్రం రాలిపోతాయి. వాడి బిల్డప్ చూసి నాకు చాలా కోపం వస్తోంది.

 నన్ను నిజంగా చాలా బాధకు గురి చేసింది

నన్ను నిజంగా చాలా బాధకు గురి చేసింది

అయినా ఇలాంటి వారిని ఎలా నమ్ముతారో అర్థం కావడం లేదు. ఒకవైపు రోజు మీడియాలలో సెలబ్రెటీస్ పేరును వాడుకొని మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వస్తున్నాయి. అయినా కూడా ఎలా నమ్ముతారు. ఈ విషయం నన్ను నిజంగా చాలా బాధకు గురి చేసింది. ఈ విషయంపై స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే మాట్లాడుతున్నాను.

 మరొకసారి ఇలాంటివి నమ్మకండి.

మరొకసారి ఇలాంటివి నమ్మకండి.

దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి. ఒకవేళ నమ్మినా కూడా డబ్బులు లాంటివి ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. సెలబ్రెటీస్ పేర్లు చెప్పి డబ్బులు దొబ్బేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరొకసారి ఇలాంటివి నమ్మకండి. చైతన్య అనే వ్యక్తి నా పేరును సెలబ్రెటీస్ దగ్గర కూడా చెప్పినట్లు తెలిసింది.

Recommended Video

Actor Kaikala Satyanarayana Thanking Megastar Chiranjeevi & Pawan Kalyan | Filmibeat Telugu
 కనిపిస్తే మాత్రం మామూలుగా ఉందదు

కనిపిస్తే మాత్రం మామూలుగా ఉందదు

ఇక నుంచి నా పేరు చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఏ మాత్రం నమ్మకండి. కనీసం సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా కూడా మమ్మవద్దు. ఇది నా రిక్వెస్ట్. దయచేసి నమ్మకండి. ఇది అంత తేలిగ్గా వదిలేసే వ్యవహారం కాదు. తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. వాడు కనిపిస్తే మాత్రం మామూలుగా ఉందదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ సునీత వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X