twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సింగర్ సునీత చుట్టూ ఎప్పుడు వివాదాలు, ఎఫైర్లకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందంగా ఉండటం, భర్తతో విడిపోయి సింగిల్ గా ఉండటం బహుషా ఇందుకు కారణమై ఉండొచ్చు. ఇటీవల ఆమె ఆమె హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న అనే కార్యక్రమంలో తన మనోగతాన్ని విప్పాకరు. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

    ఇప్పటి సునీతను సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా.... చూసాం. ఇటీవల 'రాగం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటిగా కూడా మారారు. దీనిపై సునీత స్పందిస్తూ.... తాను ఈ సినిమా చేయడానికి కారణం చైతన్య అనే అమ్మాయి. నాతో షార్ట్ ఫిల్మ్ చేయాలని తన డ్రీమ్ అని చెప్పింది. ఆమె అడగ్గానే ఎందుకు ఓకే చెప్పానో తెలియదు కానీ ఒప్పేసుకున్నా. కొంత నా జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించినా... కల్పిత కథతో తీసినదే అని సునీత తెలిపారు.

    ఎప్పుడూ వార్తల్లో.... గుడ్ అండ్ బ్యాడ్

    ఎప్పుడూ వార్తల్లో.... గుడ్ అండ్ బ్యాడ్

    నా పేరు ఎప్పుడూ మీడియాలో లైమ్ లైట్లో ఉటుంది...ఎందుకో నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఇది సాధించాను, ఇన్ని అవార్డులు వచ్చాయని ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు, లో ప్రొఫైల్ ఎంత మెయింటేన్ చేద్దామన్నా నాపై ఏవో రూమర్స్ క్రియేట్ చేసి వార్తల్లోకి లాగుతున్నారు అని సునీత తెలిపారు.

    మహేష్ బాబుకు పిన్నిని చేసారు, నాకు తెలియకుండా పెళ్లి చేసారు

    మహేష్ బాబుకు పిన్నిని చేసారు, నాకు తెలియకుండా పెళ్లి చేసారు

    మహేష్ బాబుతో పిన్ని నటించబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఎవరు చేస్తున్నారో తెలియదు. నాకు మళ్లీ పెళ్లయినట్లు కూడా రూమర్స్ క్రియేట్ చేసారు. వేరొకరితో ఎపైర్స్, లింకప్స్ పెట్టి నాగురించి తప్పుగా మాట్లాడటం విన్నాను అని సునీత తెలిపారు.

    పట్టించుకోవడం, బాధ పడటం మానేసాను

    పట్టించుకోవడం, బాధ పడటం మానేసాను

    ఒకప్పుడు రూమర్స్ విని బాధ పడేదాన్ని. కానీ ఇపుడు అవన్నీ నేను పట్టించుకోవడం లేదు, నాకంటూ జీవితం ఉంది, వీటిని పట్టించుకునే సమయం లేదు. ప్రతి నెల నాకు టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నా పద్దతిలో నేను పని చేసుకుంటూ వెళ్లి పోవాలి. నా ఆత్మాభిమానం చంపుకోకుండా ఉన్న పరిధిలో నేను ఎంత వరకు పని చేయాలి. ఎంత వరకు పని చేస్తే ఎంత వరకు నా కుటుంబాన్ని పోషించుకుంటాను పిల్లలు, వారి ఫ్యూచర్ అంటూ ముందుకు సాగుతున్నాను అని సునీత తెలిపారు.

    సింగిల్ గా ఉండటం వల్లే కావచ్చు

    సింగిల్ గా ఉండటం వల్లే కావచ్చు

    సింగిల్ గా ఉండటం వల్లే ఇలాంటి జరుగుతూ ఉండొచ్చు. సింగిల్ గా ఉంటూ కాన్ఫిడెంటుగా, ఏ మాత్రం తగ్గకుండా నా దారిలో నా లైఫ్ లీడ్ చేస్తుండటం వల్ల ఇలాంటి రూమర్స్ వస్తున్నాయేమో. నేను పాట పాడటం, డబ్బింగ్ చెప్పడం, స్టేజీ షోలు చేయడం, యాంకరింగ్ ఏదో ఒకటి కాకుండా అన్ని చేస్తుండటం వల్ల కూడా జలస్ తో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారేమో అని సునీత అన్నారు.

    నా ఆత్మాభిమానం

    నా ఆత్మాభిమానం

    నా ఆత్మాభిమానం, నేను బావుండటం నాకు ముఖ్యం. దాని కోసం నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారికి అది నచ్చక ఇగో హర్టయి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చని సునీత తెలిపారు.

    చెల్లెమ్మ అని పిలిచే వారంతా పవిత్రమైన వాళ్లు కాదు

    చెల్లెమ్మ అని పిలిచే వారంతా పవిత్రమైన వాళ్లు కాదు

    ఇండస్ట్రీ అనేదే కాదు.... సొసైటీలో నూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.... మంచిగా అప్రోచ్ అయ్యేవారు ఉంటారు. మంచి గా అప్రోచ్ అయ్యి చెడు భావాలు కలిగిన వారు ఉంటారు. చెల్లెమ్మ అని పిలిచినంత మాత్రాన మనసులో పవిత్రమైన భావం ఉంది అని నమ్మే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో అని సునీత అన్నారు.

    ప్రేమించే వాళ్లు ప్రేమిస్తున్నారు

    ప్రేమించే వాళ్లు ప్రేమిస్తున్నారు

    ప్రేమించే వాళ్లు విపరీతంగా ప్రేమిస్తున్నారు...ఇష్టం లేని విపరీతంగా అసహ్యించుకుంటున్నారు. సూపర్ సింగర్ 7 జరిగేప్పుడు ఓ వర్గం. ఆ సమయంలో నరకం చూసాను అని సునీత తెలిపారు.

    కంప్లీట్‌గా డిస్ కనెక్ట్ అయ్యాను

    కంప్లీట్‌గా డిస్ కనెక్ట్ అయ్యాను

    ఈ పరిస్థితుల వల్ల నేను కంప్లీట్ గా ఈ ప్రపంచంతో డిస్ కనెక్ట్ అయిపోయాను. నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, పని ఉంటే వెళ్లి చేయడం. ఫ్రెండ్స్ తో సినిమాలకు వెల్లడం కూడా మానేసాను. పరిస్థితుల కారణంగా నా చుట్టూ గోడకట్టుకోవాల్సి వచ్చింది. నాది గోడకట్టుకునే మనస్తత్వం కాదు. కొంతకాలం ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేసాను.

    మధు యాష్కితో ఎఫైర్

    మధు యాష్కితో ఎఫైర్

    మధు యాష్కీ గారితో లింక్ చేసి మాట్లాడారు. నాకు చాలా బాధేసింది. నాకు అసలు విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరు చేసారు? ఎందుకు చేసారో అర్థం కాదు అని సునీత అన్నారు.

    గత ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టడం వెనక

    గత ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టడం వెనక

    గతంలో ఇంటర్వ్యూ ఇవ్వడం, కన్నీరు పెట్టడం, నా జీవితానికి సంబంధించిన విషయాలు అన్ని చెప్పడం వెనక లీగల్ రీజన్ ఉంది. లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కునే పరిస్థితి ఎదురైంది. కానీ కొందరు దీన్ని నేను పబ్లిసిటీ కోసం చేసినట్లు మాట్లాడారు అని సునీత అన్నారు.

    భర్తతో విడిపోవడంపై

    భర్తతో విడిపోవడంపై

    భర్తతో విడిపోవడంపై స్పందిస్తూ.... బాధ్యత లేక పోవడం ఏ ఆడది భరించలేదు. నువ్వు ఎలా ఉన్నా ఫర్వాలేదు, నేను సునీత హస్బెండుగా ఉంటే చాలు లాఫ్ లాంగ్ అనుకునే వాడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడని, నాకొక గుడ్ లైఫ్ ఇస్తాడని నమ్మకం లేదు. రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నపుడు దానికి స్టిక్ అయి ఉండాలని, తప్పు ఎవరిదైనా కావొచ్చు. అని చాలా కాలం వెయిట్ చేసాను. దాని వల్ల నా హెల్త్, నా రెపుటేషన్, సైకలాజికల్ గా నేను ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అపుడు నేను నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ సందర్భంలో అతడు ఇంపార్టెంట్ అనుకుంటే నేను చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. పోనీ పర్పస్‌ఫుల్ గా ఉంటుందా? ఇన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నాకు ఫ్యూచర్ కనిపించలేదు. నాకు పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్. నేను తీసుకున్న నిర్ణయం వల్ల పిల్లలకు మంచి జరిగింది. నెగెటివ్ అట్మాస్మియర్ లేదు. అయ్యో మాకు ఒకటి తగ్గింది... ఎవరో ఉండి మమ్మల్ని చూసుకుంటే బావుండేది అనే ఫీలింగ్ కూడా లేకుండా పెంచాను. నేనేదో పొగరుగా పెంచలేదు, ప్రేమగా పెంచాను. ఏది రాంగ్, ఏది రైట్ అని తెలుసుకునే లా పెంచాను సునీత తెలిపారు.

    మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనపై

    మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనపై

    మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అంటే నా ఒక్కదాన్ని గురించే పరిస్థితి లేదు. పిల్లలు ఉన్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని కాదు, చేసుకోకూడదని కాదు... దీన్ని నేచర్ కి, ఫ్యూచర్ కి వదిలేస్తున్నాను...ఏం జరుగుతుందో చూద్దాం అని సునీత అన్నారు.

    ఉదయభాను ఇష్యూపై

    ఉదయభాను ఇష్యూపై

    ‘ఆ మధ్య ఓ పేపర్లో ఉదయభాను ఇంటర్వ్యూ చదివాను. నా పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. ఆమె చెప్పింది నా గురించే అని అర్థమైంది. నిజానికి తను నన్ను అపార్థం చేసుకుంది. అది పూర్తిగా నా షో. ఆ ప్రోగ్రామ్‌కు రమ్మని ఉదయభానును నేను పిలవలేదు. ఆర్గనైజర్లు పిలిచారు. అలాంటప్పుడు నేనెందుకు స్టేజ్‌పైకి పిలుస్తాను. ఇక ఆమె స్టేజ్‌ మీదకు వస్తున్నప్పుడు నా మ్యూజిక్‌ టీమ్‌ స్యాడ్‌ ట్యూన్‌ ప్లే చేశారని చెప్పింది. ఆ విషయం నాకు గుర్తులేదు. ఆ షో నుంచి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కలిసినపుడు ఉదయభానును నేను వెళ్లి పలకరించేదాన్ని. ఆమె నాతో మాట్లాడేది కాదు. ఏమైందో నాకు అర్థమయ్యేది కాదు. మొన్న ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాతే ఆమె కోపానికి కారణం తెలిసింది. అంత చిన్న ఇన్సిడెంట్‌ను కూడా ఆమె మనసులో పెట్టేసుకుంద'ని సునీత వివరణనిచ్చింది.

    English summary
    Singer Sunitha open about her personal life. Check out details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X