twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్

    |

    గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేరు. కానీ ఆయన పాడిన పాటలు మాత్రం రోజులో ఒక్కసారైనా విని తీరుతాం. భౌతికంగా లేకపోయినా ఎస్పీబీ ఎప్పుడూ సంగీత ప్రియుల మదిలో ఉంటారు. అలాంటి ఎస్పీబీని సింగర్ సునీత తాజాగా తలుచుకుని ఎమోషనల్ అయింది. ఎస్పీబీ కరోనా బాధపడుతున్న సమయంలో, తుది శ్వాస విడిచిన సందర్భంలో సునీత ఎంతగా ఎమోషనల్ అయిందో అందరికీ తెలిసిందే.

     గాన గంధర్వుడికి కరోనా..

    గాన గంధర్వుడికి కరోనా..

    గాన గంధర్వుడు ఎస్పీబీకి ఆగస్ట్ మొదటి వారంలో కరోనా సోకిన సంగతి తెలిసిందే.అయితే క్రమక్రమంగా అది సీరియస్ అయి చివరకు సెప్టెంబర్ 27 తుది శ్వాస విడిచారు. కరోనా నుంచి కోలుకోవాలని సునీత ఎంతగానో కోరుకుంది. ఆయన స్వరం ఒక శ్లోకం .. ఆయన పాట ప్రార్థన .. ఆయన మనకు దేవుడు. మనము అతని గొంతును వినాలి. మనమందరి కోసం ఆయన తిరిగా రావాలి.. మునుపటి ధ్వని, ఆరోగ్యకరమైన ఎప్పటిలాగే ఆనందంగా ఉండటం అవసరం. మేమంతా ఆయన కోసం ప్రతి నిమిషం ప్రార్థిస్తున్నామంటూ నాడు ఎంతో పోస్ట్‌లు చేసింది. కానీ అవేమీ ఫలించలేదు.

    మరణ వార్తపై..

    మరణ వార్తపై..

    ఇక ఎస్పీబీ మరణ వార్తపై సునీత స్పందిస్తూ.. కన్నీరు కార్చేసింది. నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే అంటూ ఎస్పీబీ మృతిపై సునీత భావోద్వేగానికి లోనైంది.

    ఆ మధ్య అలా..

    ఆ మధ్య అలా..

    ఆ మధ్య బాపు గారు పుట్టిన రోజు సందర్భంగా ఎస్పీబీని మరోసారి తలుచుకుంది. బాపు గారు పుట్టిన రోజు బాలు గారు గాయకుడుగా పుట్టినరోజు.. మనందరికి పండుగ రోజు. ధనుర్మాసం సందర్భంగా బాపు గారి బొమ్మలతో ముళ్ళపూడి వెంకట రమణ గారు రచించిన "మేలుపలుకుల మేలుకొలుపు" లో బాలు గారి సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాట నా జీవితం లో అత్యంత ప్రత్యేకమైనది. బాలు గారు దగ్గరుండి పాడించటం నా జీవితం లో మధురమైన అనుభవం. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. తిరిగొస్తే బావుండు.. అంటూ సునీత ఎమోషనల్ అయింది.

    తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    అయితే తాజాగా మరోసారి సునీత ఎస్పీబీని తలుచుకుంది. రెండో పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా సాగుతున్న తన జీవితాన్ని కళ్లారా చూసేందుకు ఎస్పీబీ లేరని సునీత ఎమోషనల్ అయినట్టుంది. మరోసారి మీ పాదాలను తాకి.. ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది మామయ్య అంటూ సునీత ఎమోషనల్ అయింది. ఎస్పీబీ కాళ్లకు దండం పెడుతున్న ఫోటోను సునీత షేర్ చేస్తూ అందర్నీ టచ్ చేసింది.

    English summary
    Singer sunitha remembders sp Balasubrahmanyam,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X