నీ మొగుడు అలాంటి వాడు అంటూ నెటిజన్ కామెంట్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సునీత
తెలుగు సింగర్ గా సునీత మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఆమె పాడే పాటల కంటే కూడా ఎక్కువగా తన అందంతో అలాగే వివాదాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించారు. ఆమె మొదటి భర్త నుంచి విడిపోయినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో ఆమె పేరు లాగుతూ రెండో పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ వచ్చేవి వెబ్ మీడియా పోర్టల్స్. తాజాగా రెండో వివాహం చేసుకున్న ఆమె తన భర్తను తనను కించపరిచే విధంగా మాట్లాడిన నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస ట్రోల్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు పాట తో తొలిసారిగా సింగర్ గా మారిన సునీత ఆ తర్వాత అనేక వందల పాటలు పాడి ఎంతో మంది తెలుగు వారిని తన అభిమానులుగా మార్చుకున్నారు. అయితే ఆమె పాటలు మాత్రమే కాక అనేక సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు.. అయితే భర్తతో విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవితాన్ని గడిపారు.

తనదైన శైలిలో కౌంటర్
అయితే సింగర్ సునీత ఈ మధ్యకాలంలో రామ్ అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ అధినేతను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు. అయితే ఈ వివాహం ఎవరూ ఊహించని విధంగా జరగడంతో ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయించింది.

దిమ్మతిరిగే కౌంటర్
అయితే పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా గడుపుతున్న సునీతపై కొందరు ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ఆమె భర్తను దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేశాడు. దీంతో సునీత కూడా అతనికి దిమ్మతిరిగే విధంగా కౌంటర్ ఇచ్చింది.

నెటిజన్ రెచ్చిపోయి
అసలు విషయం యింతటినీ తాజాగా సునీత, రామ్ వీరపనేని సమానత్వానికి మారుపేరుగా చిన్నజీయర్ స్వామి హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్న రామానుజుల విగ్రహాన్ని సందర్శించి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' అంటూ సునీత ఈ పిక్ ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పిక్ ను చూసిన ఓ నెటిజన్ రెచ్చిపోయాడు.

ముసలి రామ్ మొగుడు
''కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన సునీత 'నోటి దూల నీది. నీ భారం భూమిది' అంటూ అతని స్టైల్ లోనే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. నెటిజన్ చేసిన ఆ కామెంట్ దానికి సునీత ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక అలా మాట్లాడిన సదరు నెటిజన్ కు చాలా మంది గడ్డి పెడుతూ కామెంట్లు చేశారు.
ఎన్నో చూశా
ఇక ఆ తర్వాత సునీత మరో కామెంట్ చేసింది. My dear friends .. నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నా కోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది వున్నారని తెలుసుకొని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే వున్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం. God bless such perverted minds అంటూ ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











