దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
సింగర్ సునీత పెళ్లి జరిగింది. ఈ రెండో వివాహాంపై ఎంతటి ప్రశంసలు కురిపించారో.. అంతే స్థాయిలో నెగెటివిటీని ప్రచారం చేశారు. అయితే ఎక్కడైనా కూడా మంచి చెడు రెండూఉంటాయన్నట్టుగా.. సునీత మాత్రం నెగెటివిటీని పట్టించుకోనట్టు కనిపిస్తోంది. సునీత తన పెళ్లి తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలను క్లియర్‌గా చెప్పేసింది. హనీమూన్ లాంటి వ్యవహారాలను సున్నితంగా తోసి పుచ్చింది. తాజాగా సునీత్ ఓ పోస్ట్ చేసింది.
Recommended Video
PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్

పరిమితంగానే..
సునీత సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అవసరం అనుకుంటే తప్పా ఎక్కువగా పోస్ట్‌లు పెట్టదు. సునీత తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కువగా షేర్ చేయలేదు. తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను మాత్రమే షేర్ చేసింది.

సెలెబ్రిటీల సమక్షంలో..
సునీత్ రామ్ వీరపనేని వివాహాం గుడిలో జరిగింది. ఈ వేడుకకు అతి కొద్ది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇండస్ట్రీ నుంచి నితిన్, సుమ, రేణూ దేశాయ్, దిల్ రాజు వంటి వారు కొందరు హాజరయ్యారు. బంధు మిత్రుల సమక్షంలో వివాహాం ఘనంగా జరిగింది.

రెండో పెళ్లిపై రచ్చ..
సునీత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. అయినా కూడా సునీత వాటన్నంటిని పట్టించుకోలేదు. సెలెబ్రిటీలు సైతం సునీతకే మద్దతు తెలిపాడు. సోషల్ మీడియాలోనూ మెజార్జీ శాతం సునీత వైపే నిలబడ్డారు. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటని ట్రోలర్స్‌ను ఏకిపారేశారు.

మరీ ముఖ్యంగా మెగా బ్రదర్..
ఇక సునీత పెళ్లిపై నాగబాబు స్పందించాడు. సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు.. దాన్ని మనం వెతుక్కోవాలి.. రామ్, సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుక్కున్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి, కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదహరణగా మీ జంట నిలిచిందంటూ ప్రశంసలు కురిపించాడు.

తాజాగా అలా..
సునీత తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో సునీత బాగానే ముసిముసినవ్వులు నవ్వుతోంది. కాఫీ తాగే సమయమిది అంటూ కాఫీ తాగుతున్న ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ కాఫీని చేసింది మాత్రం ఎవరో చెప్పలేదు. మొత్తానికి పెళ్లి తరువాత సునీత ఎంతో సంతోషంగా జీవిస్తోన్నట్టు ఈ ఫోటోను చూస్తేనే తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











