twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీత ఇలా షాకిచ్చిందేంటీ ?

    తెలుగు సెలబ్రిటీలు రెండు రకాలు. ఒకరు తరచూ వార్తల్లో కనిపించే వారు. మరొకరు వార్తల్లో అప్పుడప్పుడు కనిపించే వారు. సింగర్ సునీత రెండో పక్షానికి చెందిన వారు.

    By Staff
    |

    Recommended Video

    సునీత ఇలా షాకిచ్చిందేంటీ ?

    తెలుగు సెలబ్రిటీలు రెండు రకాలు. ఒకరు తరచూ వార్తల్లో కనిపించే వారు. మరొకరు వార్తల్లో అప్పుడప్పుడు కనిపించే వారు. సింగర్ సునీత రెండో పక్షానికి చెందిన వారు. ఈ రెండు కోవకు చెందిన తెలుగు సెలబ్రిటీల్లో ఉన్నది ఉన్నట్లుగా కానీ.. నిష్ఠూరంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ పెదవి విప్పే వారు దాదాపుగా లేరనే చెప్పాలి. ఇక.. సినిమా సెలబ్రిటీలలో అలాంటి బ్యాచ్ కనిపించదు. నిత్యం వివాదాలతో కాలం గడిపే వర్మ సంగతి ఇక చెప్పనక్కర్లేదనుకోండి !

    అయితే ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ.. తన పని తానూ చేసుకుపోయే సింగర్ సునీత.. తాజాగా తన పోస్ట్ తో ఒక్కసారి వార్తల్లోకి వచ్చేశారు. ఏంటి.. సింగర్ సునీత నిజంగా అంత మాట అందా? అంటూ ఇప్పుదు అందరు తనవైపు చూడాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద మగమహారాజులు సైతం కేసీఆర్ సర్కారుపై కించిత్ వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడరు..అలాంటిది తన ఓపెన్ పోస్ట్ తో ఒక్కసారిగా షాకిచ్చారు.

    ఇంతకీ సింగర్ సునీత పోస్ట్ చేసిన షాకింగ్ పోస్ట్ ఏందంటే.. హైదరాబాద్ రోడ్ల గురించి ఏ ప్రముఖుడూ టచ్ చేయని రీతిలో టచ్ చేసేశారు. ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా.. సుత్తి లేకుండా.. సూటిగా చెప్పాల్సింది చెప్పేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేశారు. ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొంగొత్తగా.. అసలు ఆ రోడ్లు ఉన్నది హైదరాబాద్ లోనేనా అన్నట్లుగా తళతళ మెరవటం.. రోడ్డు మధ్యలో పూల మొక్కలు.. పెయింటింగ్స్ తో అదరగొట్టేస్తున్న వేళ.. సునీత చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఏమైనా సునీత గట్స్ను చూసి తెలుగు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోవటం ఖాయం.

    English summary
    singer sunitha commented on hyderabad roads. sunitha post is getting viral now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X