కావాలనే టార్గెట్ చేశారు.. ఆ సమయంలో నరకం చూశాను: సింగర్ సునీత
సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ ని నీరూపించుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జీవితంలో గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేని మనుషులు చాలా మంది ఉంటారు. కావాలని టార్గెట్ చేసి కెరీర్ పై దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే గాయనిగా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత కూడా అలాంటి చేదు అనుభవాలను చాలానే ఎదుర్కొందట.

బెస్ట్ సింగర్..
తెలుగు వారికి ఇష్టమైన సింగర్స్ లలో సింగర్ సునీత ఒకరు. కెరీర్ మొదట్లోనే గులాబీ సాంగ్ తో సౌత్ ఇండస్ట్రీని ఆకర్షించింది. ఆమె స్వీట్ వాయిస్ కి చాలా మంది సినీ సంగీత దర్శకులు ఫిదా అయ్యారు. ఒక్క సాంగ్ తోనే కెరీర్ కి సరిపడా క్రేజ్ ని అందుకున్నారు. అయితే ఆమె విజయవంతమైన కెరీర్ లో కూడా పలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదట.

కావాలనే టార్గెట్ చేశారు.
ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా సునీత ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను గురించి మాట్లాడింది. 'కొంతమంది నన్ను కావాలనే టార్గెట్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా నాపై అబద్ధపు వార్తలు క్రియేట్ చేసి నరకం చూపించారు. కొంతమంది జూనియర్ సింగర్స్ కూడా ఎగతాలి చేస్తూ ఇమిటేట్ చేయడం బాధగా అనిపించింది' అంటూ సునీత తన బాధను తెలియజేసింది.

ఒంటరిగా ఎంతో కష్టం..
పురుషాధిక్య సమాజంలో ఒక మహిళగా బ్రతకడమే చాలా కష్టమనుకున్న తరుణంలో పిల్లలను కూడా పెంచడం చాలా కష్టమైంది. కష్టాల్లోనే నేను నా జీవితాన్ని వెతుకున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. అన్నిటిని ఎదుర్కొని నా అభిమానుల కోసం సింగర్ గా ఈ స్థాయికి చేరుకున్నాను. అదే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
Recommended Video

ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో...
కొంతమంది ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో నాకు దూరమయ్యారు. వారు అలా ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు. కొంతమంది తెలిసిన అడవాళ్లే నాపై చెడుగా ప్రచారం చేశారు. ఇక నన్ను టార్గెట్ చేస్తూ కొన్ని వెబ్ సైట్స్ లలో చెడుగా వార్తలు రాసేవారు. అలాగే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి నాపై అసభ్యంగా దుష్ప్రచారం చేసేవారు అంటూ సునీత తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











