Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ఏర్పరచుకున్న సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివాహంపై వచ్చిన ట్రోల్స్ ను కూడా ఆమెను బాధించాయట. నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి నిత్యం ఏదో ఒక రకంగా కౌంటర్ ఇచ్చే సునీత మరోసారి ఉమెన్స్ డే సందర్భంగా కూడా ఇచ్చిన స్టేట్మెంట్ తో విమర్శకుల చెంప చెళ్లుమనిపించారు.
కొత్త జీవితంలో హ్యాపీగా..
సునీత పాటలకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో అలాగే ఆమె వ్యక్తిత్వాన్ని చూసి అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఆమె రెండో వివాహంపై అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఆమె చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ట్రోలింగ్స్ పై కౌంటర్
నిశ్చితార్థం కు నెల రోజుల ముందు నుంచే సునీత పెళ్లిపై అనేక రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. అయితే చాలా వరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత అప్పుడు పెద్దగా స్పందించకపోవడంతో రూమర్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఉమెన్స్ డే సందర్భంగా ఆమె తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి కూడా కౌంటర్ ఇచ్చారు.
ఊపిరాడనివ్వకుండా చేస్తారు
సోషల్ మీడియాలో ఈ విధంగా ఒక పోస్ట్ చేశారు. "జడ్జ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. కిందకు లాగాడానికి ప్రయత్నం చేస్తారు. ఒక విషయాన్ని నిరూపించాలని కంకణం కట్టుకుంటారు. నాలో అభద్రతా భావాన్ని కలుగజేస్తారు. నన్ను ప్రోత్సహించరు. నా మాటలు కూడా పట్టించుకోరు. నేను ఓడినప్పుడు నన్ను చూసి నవ్వుతారు. నాకు ఊపిరాడనివ్వకుండా చేస్తారు కూడా".. అని అన్నారు.
విసిరిన రాళ్లతోనే
విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు నాకు మహిళా దినోత్సవం అంటూ విషెస్ ఎలా చెబుతారు. నేను అన్ని భరించాను. నాలోని శక్తిని నేను కూడగట్టుకొని ఎదిగాను. విసిరిన రాళ్లతోనే కోటను నిర్మించుకున్నాను. అన్నిటినీ అధిగమించాను. నేను జాగ్రత్తగా ఉంటాను. ఇన్ని చేసినా కూడా నేను క్షమిస్తాను. ఎందుకంటే నేను ఒక మహిళను. కరుణామయురాలిని. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే.. అంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శకులకు సునీత కౌంటర్ ఇచ్చారు.