మద్యం బాబులపై సింగర్ సునీత షాకింగ్ రియాక్షన్.. వామ్మో ఉదయం 4గంటల్లో 95కోట్లా!
తెలుగు గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఎలాంటి కామెంట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. వీలైనంత వరకు కాంట్రవర్సీలకు తావువ్వకుండా ఎల్లప్పుడూ మంచి విషయాలతో తన ఫాలోవర్స్ ను ఉత్తేజపరుస్తుంటారు. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియా లైవ్ లోకి వస్తున్న సునీత అనేక విషయాలపై స్పందిస్తున్నారు. అయితే రీసెంట్ గా మద్యం బాబులపై ఆమె ఊహించని విధంగా స్పందించారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎక్కువవుతున్న సమయంలో సింగర్ సునీత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చెబుతున్నారు. ఇక రీసెంట్ పుట్టినరోజును కూడా అంత సంతోషంగా ఏమి జరుపుకోలేదని TNR గారు చనిపోయిన వార్త కూడా ఎంతగానో కలచివేసిందని అన్నారు.

మొహంలో ఆనందం ఎలా ఉంటుంది
ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అంటూ అలా ఉంటే మొహంలో ఆనందం ఎలా ఉంటుంది అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సింగర్ సునీత వివరణ ఇచ్చారు. ఇక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో కొంతసేపు లైవ్ లో చిట్ చాట్ చేసిన సునీత వారు అడిగిన పాటలు కూడా పాడారు.

ప్రతిరోజూ మీ కోసం పాడడానికి సిద్ధమే
తప్పకుండా ప్రతిరోజూ మీ కోసం పాడడానికి తాను సిద్ధమే అంటూ ఎవరు అక్కడికి వెళ్ళకుండా ఈ పది రోజులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పరిస్థితులు మళ్ళీ నార్మల్ గా మారే రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. ఇది ఒక్కరితో జరిగే పని కాదు. అందరం బాధ్యతగా ఉంటేనే కరోనా నుంచి బయటపడతామని అన్నారు.

మద్యం దుకాణాలు నిండిపోవడం..
లాక్ డౌన్ అని చెప్పగానే అందరూ అవసరమైన సామాన్లు తెచ్చుకున్నారు కదా అంటూ రెండు రోజులకు సరిపడా సామాన్లు తెచ్చుకుంటే ఆ తరువాత లైన్ లో మనం ఉండకూడదు. అయితే ఎక్కడ చూసినా కూడా మద్యం దుకాణాలు నిండిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ సునీత నవ్వుతూ రియాక్ట్ అయ్యారు.
Recommended Video

బుధవారం ఉదయం ఏకంగా 94కోట్లు..
ఇక లాక్ డౌన్ అని చెప్పగానే మంగళవారం సాయంత్రం నుంచి ముందు బాబులు వైన్స్, బార్ల వద్ద క్యూలో నిలబడడం అందరిని షాక్ కు గురి చేసింది. నిన్న మొత్తం రూ. 125కోట్లకు పైగా బిజినెస్ జరుగగా బుధవారం ఉదయం 6గంటల నుంచి 10గంటల మధ్యలో ఏకంగా రూ. 94 కోట్ల లిక్కర్ సేల్స్ జరగడం మరింత షాక్ కు గురి చేసింది. దీంతో సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యపోతూ ఇలా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











