ఓన్లీ కాన్పిడెన్స్ తోనే చిరు సినిమాకి పోటీగా శేఖర్ కమ్ముల
మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. చిరంజీవిగారి సినిమా రిలీజ్ అయిన రోజే ఆనంద్ సినిమా విడుదలవడం చూసి శేఖర్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. కానీ తరువాత అర్థమయింది అది ఓన్లీ అతడి కాన్ఫిడెన్స్ అని..శేఖర్ కమ్ముల గురించి గాయని సునీత చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లో ఆనంద్ నాటి పరిస్ధితిని వివరిస్తూ...శేఖర్ ఆనంద్ సినిమాని తన బిడ్డలా భావించాడు. ఆ సినిమాని ఎంత ప్రేమించాడంటే...సినిమా ప్లాప్ అయ్యుంటే శేఖర్ పరిస్థితిని మేము ఊహించలేం. కన్నతల్లి తన బిడ్డ కోసం ఎంత శ్రమపడుతుందో ఆనంద్ సినిమా కోసం శేఖర్ అంత శ్రమ పడ్డాడు.
ఆనంద్ సినిమా అంటే ప్రేమొక్కటే కాదు. నమ్మకం కూడా. ఎంత నమ్మకం అంటే...శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో రిలీజ్ చేసేంత నమ్మకం. శేఖర్ ఏమనుకున్నాడో తెలియదు కానీ మేమంతా చాలా టెన్షన్ పడ్డాం అంది. దానికి సమాధానంగా శేఖర్ కమ్ముల...ఆనంద్ చిత్రం ఎంతో నమ్మకంతో, ప్రేమతో, శ్రమ పడి తీసిన సినిమా. సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచించి తీసిన సినిమా. మంచి కాఫీ తాగిన ఫీలింగ్ రావాలని తీసిన సినిమా. అందుకే దానికి ట్యాగ్‌లైన్ కూడా ఆ మాటే పెట్టాం. అదే ఫీలింగ్ ఇప్పటికీ నేను కొనసాగిస్తున్నాను. ప్రేక్షకులు ఆహ్వానిస్తున్నారు. అంతే.. అన్నారు. అందుకేనేమో ఆయన ప్రస్దానం ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











