ముంత కల్లుతో సింగర్ సునీత.. చేతిలో కల్లు గ్లాస్, పక్కన మరో యాంకర్ కూడా..

గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సునీతకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సంబంధించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఆమె రెండో వివాహంపై అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఆమె చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె ముంత కల్లుతో కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంగేజ్మెంట్ కు ముందే..

ఎంగేజ్మెంట్ కు ముందే..

ఎంగేజ్మెంట్ కు నెల రోజుల ముందు నుంచే సునీత పెళ్లిపై అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. అయితే చాలా వరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత అప్పుడు పెద్దగా స్పందించకపోవడంతో రూమర్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఒకరోజు ఉదయమే సోషల్ మీడియాలో ఆమె నిశ్చితార్థ వేడుక కూడా జరిగిందని కొన్ని ఫొటోస్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

 ఆ వెంటనే క్లారిటీ ఇచ్చిన సింగర్

ఆ వెంటనే క్లారిటీ ఇచ్చిన సింగర్

ఫొటోస్ లీక్ అయిన విషయం సునీతకు తెలియదట. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు. ఫొటోస్ లీక్ అయిన మరుక్షణమే సునీత అధికారికంగా వివరణ కూడా ఇచ్చారు. సునీత అధికారికంగా క్లారిటీ ఇవ్వడమే కాకుండా కాబోయే భర్త రామ్ గురించి కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

రామ్ తో హ్యాపీ లైఫ్

రామ్ తో హ్యాపీ లైఫ్

ఇక పెళ్లి అనంతరం సునీత తన భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతోంది. ఇక రీసెంట్ గా రామ్ తో దిగిన ఒక లవ్లీ ఫొటోను పోస్ట్ చేయగా అది నిమిషాల్లో వైరల్ అయ్యింది.

 ముంత కల్లుతో సునీత

ముంత కల్లుతో సునీత

ఇక రీసెంట్ గా మరో ఫొటోతో ఈ సీనియర్ సింగర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా ముంత కల్లుతో కనిపించి ఫొటోకు నవ్వుతూ స్టిల్ ఇచ్చారు.. పక్కనే కల్లుగీత కార్మికుడు కూడా ఉన్నాడు. అయితే సునీత కల్లు తాగిందో లేదో తెలియదు గాని ఇంటర్నెట్ వరల్డ్ లో మాత్రం ఆ ఫొటోలు చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Shreya Ghoshal Shares Good News With Fans | Filmibeat Telugu
మరో యాంకర్ కూడా

మరో యాంకర్ కూడా

ఇక సింగర్ సునీత పక్కనే మరో యాంకర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి కూడా ఉన్నారు. సింగర్ సునీత, గాయత్రి చాలా కాలం నుంచి స్నేహితులు. సునీతకు యాంకర్ ఝాన్సీ కూడా క్లోజ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు వాళ్ళందరూ కలిసి సరదాగా పార్టీలు కూడా చేసుకుంటారు. ఇక సింగర్ సునీత ఇటీవల నీలి నీలి ఆకాశం పాటతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X