twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందంలో సునీతకు పోటీగా వస్తున్న కూతురు.. లేటెస్ట్ ఫొటో వైరల్.. వయసు ఎంతో తెలుసా?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫీమేల్ సింగర్స్ లలో సునీత ఒకరు. ఎలాంటి పాట పాడినా కూడా తేనె లాంటి మాధుర్యాన్ని అందించగలరు. ఇక సునీత అందానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అచ్చమైన తెలుగు అందం అనేలా నిత్యం పాజిటివ్ కామెంట్స్ అందుకుంటారు. ఇక ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఇటీవల కూతురు ఫొటోను షేర్ చేసుకున్న సునీత మరోసారి ఆశ్చర్యపరిచింది.

    సింగర్ గానే కాకుండా..

    సింగర్ గానే కాకుండా..

    తెలుగు సినిమా పరిశ్రమలో గత 20 ఏళ్లుగా సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతున్న సునీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అలాగే పలు మ్యూజికల్ షోలకు కూడా హోస్ట్ గా, జడ్జిగా కూడా వ్యవహరించారు. సునీత ఎలాంటి పాట పాడినా కూడా జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది.

    సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్

    సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్

    ఇక సునీత ఫ్యామిలీ లైఫ్ గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ కూడా రోజురోజుకు భారీగా పెరుగుతున్నారు సునీత ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతుంది. అలాగే అప్పుడప్పుడు పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తున్నారు.

    19వ పుట్టినరోజు

    19వ పుట్టినరోజు

    అయితే రీసెంట్ గా సునీత తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ అమ్మాయి పేరు శ్రేయా గోపరాజు. సునీత కొడుకు పేరు ఆకాష్. ఇక శనివారం శ్రేయా 19వ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సునీత మై ప్రిన్సెస్ అంటూ కామెంట్ చేసింది.

    అందంతో సునీతకు పోటీగా

    అందంతో సునీతకు పోటీగా

    శ్రేయా లేటెస్ట్ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అవుతోంది. సునీతకు 19 ఏళ్ళ కూతురు ఉందని అంటే నమ్మలేకపోతున్నాం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే అందంతో కూడా సునీతకు పోటీగా వస్తున్నట్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

    Recommended Video

    Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
    తల్లి బాటలోనే కూతురు

    తల్లి బాటలోనే కూతురు

    శ్రేయా గోపరాజు కూడా తల్లి బాటలోనే సింగింగ్ ను కెరీర్ గా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సవ్యసాచి సినిమాలో మొదటి పాట పాడింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ కొనసాగుతోంది. మరోవైపు శ్రేయా చదువును కూడా కొనసాగిస్తోంది.

    English summary
    Sunita also has a lot of fans for her beauty. Positive comments are always received as to the true Telugu beauty. Now that she has two children it can be a bit hard to believe. Sunita, who recently shared a photo of her daughter, was once again surprised.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X