Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సునీత.. పెళ్లి డేట్‌పై సింగర్ క్లారిటీ
సింగర్ సునీత రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అవుతోందో అందరికీ తెలిసిందే. రెండో పెళ్లిపై వచ్చిన రూమర్లు నిజమయ్యేలా చివరకు సునీత సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. తనకు కాబోయే భర్త అంటూ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ పెళ్లిని కూడా పెళ్లిలా కాకుండా రెండు కుటుంబాల కలయికగా చూడాలంటూ సునీత చెప్పుకొచ్చింది.
అడల్ట్ వెబ్ సిరీస్ 'గంధీబాత్' ఫేం అన్వేషీ జైన్ హాట్ ఫొటోలు
వాయిదా అంటూ ప్రచారం..
డిజిటల్ మీడియాకు చెందిన రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నానని సోషల్ మీడియా ద్వారా సునీత ప్రకటించింది. నిశ్చితార్థం అయిందంటూ సునీత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కానీ పెళ్లి తేదీల్లో మాత్రం మార్పులు వచ్చాయి. సునీత పెళ్లి వాయిదా పడిందంటూ రకరకాల వార్తలు వచ్చాయి.
ప్రీ వెడ్డింగ్ పార్టీలు..
సునీత పెళ్లి తేదీపై ఎన్ని వార్తలు వచ్చినా కూడా ప్రీ వెడ్డింగ్ పార్టీలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీని నితిన్ ఏర్పాటు చేశాడని టాక్ బయటకు వచ్చింది. ఈ ఈవెంట్లో రేణూ దేశాయ్, సుమ వంటి వారంతా సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.
తిరుమలలో సునీత..
ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె.. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సునీత చెప్పుకొచ్చింది. అక్కడి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి తేదీపైనా క్లారిటీ ఇచ్చాడు.
పెళ్లి తేదీపై ప్రకటన..
జనవరి 9న తమ వివాహం జరగనుందని సునీత పేర్కొంది. నిజానికి డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావించినప్పటికీ ఇద్దరి జాతకాల ప్రకారం సరైన ముహూర్తాలు లేకపోవడంతో జనవరి 9వ తేదీన ఈ మూడు మూళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల నేపథ్యంలో పెళ్లి వేడుకలు సింపుల్ జరుగనున్నట్టు తెలుస్తోంది.
అల.. వైకుంఠపురములో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు