అచేతనంగా ఉన్న సత్య సాయి బాబాను చూసి ఏడ్చిన సుశీల
సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని చూసి ప్రముఖ సినీ నేపధ్య గాయని సుశీల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బాబా పార్ధివ దేహాన్ని చూసి తట్టుకోలేక ఆమె బోరును ఏడ్చేశారు. ఆమెను మంత్రి గీతా రెడ్డి అక్కున చేర్చుకుని ఓదార్చారు. పాత తరం హీరోయిన్ అంజలీ దేవి సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని చూసి తీవ్ర కలతకు లోనై స్పృహ తప్పి పడిపోయారు. సినీ రంగంలోని పలువురు పెద్దలు సత్య సాయిబాబా భక్తులే. స్వర్గీయ ఘంటసాల సత్య సాయిబాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందినవారే.
హిందీ సినీ రంగానికి చెందిన మనోజ్ కుమార్, మహ్మద్ రఫీ కూడా బాబాను సందర్శించి ఆశీస్సులు పొందారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సత్య సాయిబాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ కూడా సత్య సాయి భక్తుడే.
susheela sathya saibaba puttaparthi anantapur sathya sai trust సుశీల సత్య సాయిబాబా పుట్టపర్తి అనంతపురం సత్య సాయి ట్రస్టు


Click it and Unblock the Notifications