twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!

    |

    ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజండరీ దర్శకులు కే విశ్వనాథ్ మరణవార్త మరవకముందే దిగ్గజ గాయనీ వాణి జయరాం మరణం భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం అంటే ఫిబ్రవరి 4న చెన్నైలో తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పటివరకు ఆమెది సహజమరణమే అని అంతా భావించారు. కానీ లెజండరీ సింగర్ వాణి జయరాం మృతిపట్ల అనుమానాలు కలిగించే పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

     బాల్యంలోనే సంగీతంలో..

    బాల్యంలోనే సంగీతంలో..

    వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె నవంబర్ 30న 1945లో తమిళనాడులోని వెళ్లూరులో జన్మించారు. దురైస్వామి అయ్యాంగర్, పద్మావతి దంపతులకు మొత్తంగా ఆరుగురు సంతానం. అందులో ఐదో సంతానంగా వాణీ జయరాం జన్మించారు. వాణీ జయరాం తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. దీంతో బాల్యంలోనే వాణీ జయరాం సంగీతంలో విశేషమైన ప్రతిభ కనబర్చింది. ఎనిమిదో ఏటనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది.

     అనుకోని విధంగా..

    అనుకోని విధంగా..

    వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద సంగీతం అభ్యసించగా, హిందుస్తాని సంగీతాన్ని ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడంతో సినిమాలో పాడే అవకాశం లభించింది. హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపథ్య గాయకురాలిగా వాణీ జయరాం తెరంగేట్రం చేశారు.

     ఆ పాటతో తెలుగులోకి..

    ఆ పాటతో తెలుగులోకి..

    1971లో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగపెట్టిన వాణీ జయరాం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యానీ, తులు, బెంగాళీ, అస్సామీ ఇలా సుమారు 14 భాషల్లో దాదాపు 20 వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో మాత్రం 1973 సంవత్సరంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి అధ్వర్యంలో అభిమానవంతులు అనే సినిమా కోసం ఎప్పటివలే కాదురా నా స్వామి అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు.

    అద్భుతమైన గానంతో..

    అద్భుతమైన గానంతో..

    శంకరాభరణం సినిమాలో వాణీ జయరాం ఏకంగా ఐదు పాటలు పాడటంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సీతామహాలక్ష్మీ, శృతిలయలు, స్వాతి కిరణం, ఘర్షణ లాంటి చిత్రాలు ఆమెకు సూపర్ పాపులారిటీని తీసుకొచ్చాయి. సుమారు 5 దశాబ్దాలకుపైగా తన గాత్రంతో సంగీత ప్రియులను, సినీ ప్రేక్షకులను అలరించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన గానంతో చెరగని ముద్ర వేసుకున్న వాణీ జయరాం ఇక లేరనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కలచివేస్తుంది.

    పోలీసుల కేసు నమోదు..

    పోలీసుల కేసు నమోదు..

    అయితే లెజండరీ సింగర్ వాణీ జయరాం మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అది ఒక మిస్టరీగా మారింది. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్దౌస్ రోడ్డులోని ఆమె తన సొంత నివాసంలో ప్రమాదానికి గురి అయ్యారు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తాయి. ఆమె మృతి పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో మరిన్ని సందేహాలకు కారణం అయింది. వాణీ జయరాం ఇంట్లోని గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమె ముఖానికి బలమైన గాయాలు అయినట్లు సమాచారం.

     రక్తపు మడుగులో వాణీ..

    రక్తపు మడుగులో వాణీ..

    శనివారం ఉదయం ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరట. ఇంట్లో వాణీ జయరాం ఒక్కరే ఉంటారు. పని మనిషి వచ్చి తలుపు కొట్టగా వాణీ జయరాం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో.. బంధువులకు సమాచారం అందించారట. బంధువులు వచ్చి తలుపు తీసి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి వాణీ జయరాం రక్తపు మడగులో ఉన్నారట. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె మరణించినట్లు తెలిసింది.

    ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారా..

    ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారా..

    వాణీ జయరాం పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాణీ జయరాం గ్లాస్ టేబుల్ పై పడటం, రక్తపు మడుగులో ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుది. వాణీ జయరాం కాలు జారి పడ్డారా? లేదంటే ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారా? అనే విషయాలు తెలియాల్సి ఉందని సమాచారం.

    English summary
    Legendary Singer Vani Jayaram Passed Away At Chennai On February 4. She Is In Pool Of Blood And Causes Mysterious Death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X