అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం

కొందరికీ ఒక్కోసారి ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అలా వచ్చిన స్టార్డంను కొందరు ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. సోషల్ మీడియాలో అలా సింగర్‌గా మెరిసి ఓవర్ నైట్‌లో సెన్సేషనల్ అయ్యారు. అలా ఉత్తరాదిన రణు మండాల్, తెలుగులోనూ అలా ఓ గాయని బాగానే ఫేమస్ అయింది. కానీ వారికి వచ్చిన క్రేజ్‌ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో యశస్వీ కొండెపూడి అనే యువ గాయకుడి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది.

సరిగమప షోలో..

సరిగమప షోలో..

సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ షోలో యశస్వీ కొండెపూడి సంచలనంగా మారింది. లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన గాత్రంలోని మాధుర్యంతో అందరినీ కట్టిపడేశాడు. అయితే అంతకు ముందు కూడా యశస్వీ పాటలు పాడుతూ ఫేమస్ అయ్యాడు. కానీ ఆ షోలో పాడిన పాటతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

ప్రేమ వ్యవహారం..

ప్రేమ వ్యవహారం..

అలా లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడి ఒరిజినల్ సింగర్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అలా యశస్వి ఎంతో మంది ప్రేమను సంపాదించుకున్నాడు. అయితే యశస్వీ తన ప్రేమను బయటపెట్టేశాడు. చిన్న తనం నుంచి తాను ప్రేమలో ఉన్నానని, ఆమె పేరు ఝాన్సీ అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నామని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

తాజాగా యశస్వీ కొండెపూడి ఓ పాట పాడాడు. ప్రియా ప్రియా చంపొద్దే అనే పాటను పాడాడు. అయితే ఆ ప్రియా ఎవరో చెప్పమని జడ్జ్‌లు అడుగుతున్నారని అంటూ ప్రదీప్ కౌంటర్ వేశాడు. అది నిజమని భావించి యశస్వీ తన ప్రేయసి పేరును చెప్పేశాడు. ఝాన్సీ అంటూ అందరి ముందే బయటపెట్టేశాడు.

అభిమానిని..

అభిమానిని..

యశస్వీ కొండెపూడికి ఇప్పుడున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అందుకే నిదర్శనంగా ఓ అభిమానిని తాజాగా షోలోకి తీసుకొచ్చారు. యశస్వీ అభిమాని అంటూ షోలో అందరికీ పరిచయం చేశారు. అయితే ఆ అభిమాని చర్యకు అందరూ షాక్ అయ్యారు.

గుండెపై పచ్చబొట్టు..

గుండెపై పచ్చబొట్టు..

అభిమానులు సాధారణంగా తమకు నచ్చిన వారిని పేర్లను పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. కొందరు బొమ్మలను కూడా వేయించుకుంటారు. ఆ అభిమాని మాత్రం గుండెపై యశస్వి బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్నాడు. అది చూసి యశస్వి ఎమోషనల్ అయి అతడిని హత్తుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X